చిన్నప్పుడు ఆమె పెళ్లికి వెళ్లాడు.. ఇప్పుడు ఆమెతోనే ప్రేమలో..

Update: 2022-09-24 00:30 GMT
బాలీవుడ్‌ లో సీనియర్ స్టార్‌ హీరోయిన్ మలైకా అరోరా మరియు యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌ లు ప్రేమలో ఉన్నారు అనే విషయం అందరికి తెల్సిందే. ఆ విషయాన్ని వారు అధికారికంగా ఒప్పుకోవడం లేదు కానీ ఇద్దరు కూడా చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. మలైకా కి ఇప్పటికే అర్భాజ్‌ ఖాన్‌ తో వివాహం అయ్యి విడాకులు అయిన విషయం తెల్సిందే.

అర్భాజ్‌ ఖాన్‌ తో విడాకులకు కారణం అర్జున్‌ కపూర్‌ తో మలైకా రొమాన్స్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే అర్జున్‌ కపూర్‌ కి చెందిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటో మలైకా అరోరా మరియు అర్భాజ్‌ ఖాన్‌ ల పెళ్లిలో దిగిన ఫోటో.

ఆ పెళ్లి లో అర్భాజ్‌ ఖాన్‌ కూల్‌ డ్రింక్ తాగుతూ ఉన్న ఈ ఫోటో చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పెళ్లికి వెళ్లి హాయిగా పెళ్లిని ఎంజాయ్ చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు ఆమెతో డేటింగ్‌ లో ఉండటం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మలైకా మరియు అర్భాజ్‌ ఖాన్‌ యొక్క వివాహం సమయంలో అర్జున్‌ కపూర్ వయసు 23 ఏళ్లుగా తెలుస్తోంది. అర్జున్‌ కపూర్‌ ఆ సమయంలో అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆమె కు జోడీగా.. జతగా ఉన్నాడు.

కాలం ఎంతలో ఎంత మార్పు చేస్తుంది అంటూ ఈ సంఘటన చూస్తుంటే అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అర్జున్ కపూర్‌.. మలైలా అరోరా ల మధ్య జరిగింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News