సామాజిక మాధ్యమాల వెల్లువలో ఎవరు ఎవరినైనా తిట్టేసే రైట్ ఆపాదించబడింది. సెలబ్రిటీ అయితే నాకేంటి? అనే ధోరణి కనిపిస్తోంది. స్టార్ హీరో .. స్టార్ హీరోయిన్.. టాప్ సెలబ్రిటీ కారేరీ తిట్టించుకునేందుకనర్హం! అన్న చందంగా ఉంది సీను. అనవసరంగా ఏదైనా కామెంట్ చేస్తే చాలు స్టార్లకు తిట్లు చీవాట్లు తప్పడం లేదు. ముఖ్యంగా హీరోల ఫ్యాన్స్ ఆవేశకావేశాలకు అడ్డూ ఆపూ లేదు. ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం అలవాటు వ్యాపకంగా మారింది.
అలానే అనవసరంగా కెలుక్కుని మరీ తిట్టించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇంతకీ ఎవరు ఈ హీరోగారు? అంటే.. పేరు అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అప్ కం స్టార్ గా ఇప్పుడిప్పుడే కెరీర్ ని ముందుకు నడిపిస్తున్నాడు కపూర్ బోయ్. ఈలోగానే పెళ్లయిన బ్యూటీ మలైకా అరోరాఖాన్ తో ఎఫైర్ సాగిస్తూ వేడెక్కించాడు. ఈ ఎఫైర్ గోలతోనే గొప్ప పాపులారిటీ తెచ్చుకున్న కుర్రహీరోగా వెలిగిపోతున్నాడు. అయితే సోషల్ మీడియాలో అతగాడు స్టార్ హీరోలు హృతిక్ రోషన్ .. టైగర్ ష్రాఫ్ పై చేసిన ఓ కామెంట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన `వార్` షూటింగ్ పూర్తవ్వగానే .. చివరిరోజు టీమ్ తో కలిసి ఫోటోలు దిగిన హృతిక్- టైగర్ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కుర్చీపై కూర్చుని ఉంటే అక్కడ హృతిక్- టైగర్ నేలపై కూచుని కనిపించారు.
ఈ ఫోటోకి ``ది లెజెండ్ అండ్ 2 రెగ్యులర్ యాక్టర్స్`` అంటూ కామెంట్ ని పోస్ట్ చేశాడు అర్జున్ కపూర్. అయితే ఈ కామెంట్ పై హృతిక్ .. టైగర్ ఫ్యాన్స్ అతడిపై మండి పడుతున్నారు. ఆ ఇద్దరూ ఇండస్ట్రీ బెస్ట్ యాక్షన్ హీరోలు. వాళ్లనే ఇలా అన్నావ్ అంటే నువ్వు ఏ కేటగిరీకి చెందుతావో చెప్పాలి అంటూ తీవ్రంగా హర్ట్ చేసే రివర్స్ కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ అర్జున్ కపూర్ ఏ కేటగిరీకి చెందుతాడో అతడే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైతే రియాలిటీలో రొమాంటిక్ గయ్ గా పాపులరైన అర్జున్ కపూర్ అంతకంతకు శత్రువుల్ని పెంచుకుంటున్నాడా? మలైకా తో ఎఫైర్ పెట్టుకోవడంతో బాలీవుడ్ పెద్దన్న సల్మాన్ ఖాన్ - ఆర్భాజ్ ఖాన్ సహా ఆ ఫ్యామిలీ అంతా విరోధులు అయ్యారని బాలీవుడ్ లో కథనాలొచ్చాయి. కొడుకు వల్ల నిర్మాత బోనీకి తలవొంపులు వచ్చాయని కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు స్నేహితులుగా ఉన్న వాళ్లపైనా కామెంట్లతో అనవసరంగా బుక్కవుతున్నాడనే అంతా భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమాషా కామెంట్ అయినా జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోయి అపార్థాలకు దారి తీయొచ్చన్నది పాపం కుర్రహీరో గమనించలేదేమో!