ఆమె ఇంటి నుంచి అర్ధరాత్రి హీరో ఎగ్జిట్

Update: 2016-11-02 04:30 GMT
గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక పాటలో ఆడిపాడిన బ్యూటీ మలైకా అరోరా ఖాన్ కు బాలీవుడ్ లో కూడా బోలెడన్ని ఐటెం సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. యాక్ట్రెస్ గా కంటే.. ఐటెం బ్యూటీగానే ఎక్కువ ఫేమస్ అయన ఈమె.. జై చిరంజీవ మూవీలో చిరుకు విలన్ గా నటించిన అర్బాజ్ ఖాన్ వైఫ్ అనే సంగతి తెలిసిందే.

గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ గట్టిగానే వినిపిస్తోంది. అయినా సరే ఫ్యామిలీ పార్టీలకు మాత్రం కలిసే హాజరవుతున్నారు వీరిద్దరూ. అర్బాజ్-మలైకాల మధ్య చిచ్చు చెలరేగడానికి కారణం ఎవరో కాదు.. శ్రీదేవి భర్త అయిన బోనీకపూర్ కొడుకు అండ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ అంటారు బాలీవుడ్ జనాలు. అప్పట్లో మలైకాతో కలిసి లేట్ నైట్స్ వరకూ ఎంజాయ్ చేస్తున్నాడని.. సల్మాన్ ఖాన్ తో వైరం ఇష్టం లేక ఈ విషయంపై కొడుకును బోనీ కపూర్ మందలించాడనే టాక్ కూడా వినిపిస్తుంది. కొన్ని నెలలుగా అర్జున్ కపూర్-మలైకాల గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. కానీ రీసెంట్ గా మలైకా ఇంటి నుంచి రాత్రి 1.30ని. లకు బయటకు వస్తూ కెమేరాలకు చిక్కాడు అర్జున్ కపూర్.

ఏకంగా రాత్రి 10 గం.లకు వెళ్లి అర్ధరాత్రి బయటకు రావడం ఒక గాసిప్ వెబ్ సైట్ సంస్థ కెమెరాలో బంధించింది. వీడియో సాక్షిగా ఇప్పుడు మరోసారి 43 ఏళ్ల మలైకా అరోరాతో.. ఈ 31 ఏళ్ల కుర్ర హీరో రిలేషన్ పై వార్తలు మొదలైపోయాయి. అయితే ఆ వీడియోను తీసేయండి అంటూ సదరు మీడియాపై ప్రెజర్ పెరుగుతోందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News