టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు - అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''అర్జున ఫల్గుణ''. 'జోహార్' ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన 'అర్జున ఫల్గుణ' టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'గోదారి వాళ్ళే సందమామా' 'కాపాడేవా రాపాడేవా' పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా సినిమాలోని 'ఒక తీయని మాటతో' అనే పాటను రిలీజ్ చేశారు.
'ఒక తీయని మాటతో కళ్ళు తెరిసే.. ఒక చల్లని చూపుతో గుండె తడిసే.. ఎద లోపలి ప్రేమలో వెళ్ళు విరిసే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. శాశ్వత్ సింగ్ - శ్రేయాస్ అయ్యర్ కలసి ఈ పాటను ఆలపించారు.
పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో శ్రీవిష్ణు - అమృత అయ్యర్ లు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకుంటున్నారు. విజువల్ గా కూడా 'ఒక తీయని మాటతో' సాంగ్ ఆకట్టుకుంది. జగదీష్ చీకటి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. విప్లవ్ నైషదం ఎడిటర్ గా వర్క్ చేశారు.
'అర్జున ఫల్గుణ' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. తేజ మార్ని కథ - స్క్రీన్ ప్లే సమకూర్చగా.. సుధీర్ వర్మ డైలాగ్స్ అందించారు. ఇందులో సీనియర్ నరేష్ - శివాజీరాజా - సుబ్బరాజు - దేవి ప్రసాద్ - రంగస్థలం మహేష్ - రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్) - చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) కీలక పాత్రలు పోషించారు.
Full View