పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని కలలు కనని వారు ఉండరు. దర్శకనిర్మాతలతో పాటు టాప్ క్లాస్ సాంకేతిక నిపుణులు అతనితో పనిచేసే అవకాశం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. పరిశ్రమలో అగ్ర దర్శకులు అతడిని కథలతో ఛేజ్ చేస్తుంటారు. 24 శాఖల టెక్నీషియన్లు పవన్ తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ఆశిస్తారు. ఇప్పటివరకూ పవన్ తో పనిచేసిన ప్రతి దర్శక నిర్మాత.. సాంకేతిక నిపుణులు.. నటీనటులు ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అరుదైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను పవన్ 20ఏళ్ల కలను నెరవేర్చానని ఆయన తెలిపారు. ``పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సెట్స్ వేశాను. ఆ సినిమాకు తాను వేసిన సెట్స్ ఎంతో నచ్చాయని..ఆన్ సెట్స్ లో తన భుజంపై చేయి వేసి గుడ్ వర్క్ అని ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేన``ని బ్రహ్మ కడలి చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల తన కల ఫలించిందని పవన్ ప్రశంసించారని తెలిపారు.
ఆ ప్రశంస ఎంతో ధైర్యాన్ని.. బలాన్ని ఇచ్చిందని.. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎంతో అవకాశం కూడా కల్పించిందని అన్నారు. బ్రహ్మ కడలి టాలీవుడ్ లో టాప్ టెక్నీషియన్. కళాదర్శకత్వం అనే అసాధారణ ప్రక్రియలో అతడు ఎంతో సృజనాత్మకతను చూపి మనసులు దోచారు. అతను చాలా సినిమాలకు ఆర్ట్ వర్క్ అందించారు. ప్రస్తుతం పలువురు అగ్రహీరోల చిత్రాలకు పని చేస్తున్నారు.