కాళ్ల‌కు దండం ప్లీజ్‌! అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది!

Update: 2019-06-24 10:39 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) తొలి స‌మావేశం దిగ్విజ‌యంగా పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పాత అధ్య‌క్షుడు శివాజీ రాజాతో క‌లిసి కొత్త అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్ చెట్టా ప‌ట్టాల్ అంటూ వేదిక‌పై క‌లివిడిగా క‌నిపించే స‌రికి హ‌మ్మ‌య్య‌! అంటూ ఆర్టిస్టులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ర‌స‌వ‌త్త‌ర‌మైన ఎపిసోడ్ త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కూడా అంతే ఇదిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ ఎపిసోడ్ లో జీవించింది మాత్రం మ‌హిళా న‌టి.. మా ఉపాధ్య‌క్షురాలు హేమ‌.

ఈ సమావేశంలో కొత్త పాత అధ్య‌క్షులు క‌లిసిపోవ‌డం చూసి ఆనందం ఆవ‌ర్ణ‌మ‌వ్వ‌గా ..  లేడీ ఆర్టిస్టుల త‌ర‌పున సాధ‌క‌బాధ‌కాల్ని లెక్క చెబుతూ న‌టి హేమ వేదిక‌పై క‌న్నీళ్ల ప‌ర్యంత‌మయ్యారు. అంతేకాదు లేడీ ఆర్టిస్టుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని `మా`లో ఉన్న 800 మంది స‌భ్యుల్లో 100-150 మంది మాత్ర‌మే మ‌హిళా ఆర్టిస్టులు వున్నా వారికి స‌రైన అవ‌కాశాలివ్వ‌డం లేద‌ని హేమ అన్నారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాల కోసం చాలా  కష్టపడుతున్నారని.. వారి ఆకలి బాధను అర్ధం చేసుకుని ఛాన్సులివ్వాల‌ని దర్శకనిర్మాతలను కోరారు.

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో తెలుగు ఆర్టిస్టులను ప్రోత్సహించాలని అక్క చెల్లెళ్ల‌ను వేరుగా చూడొద్దని అన్నారు.  కావాలంటే మీ కాళ్లకు దండం పెడతా ప్లీజ్!! అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడితో క‌లిసి కొత్త కొత్త కార్య‌క్ర‌మాల్ని చేపడుతున్నామ‌ని హేమ ఈ సంద‌ర్భంగా తెలిపారు. మా జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లో క‌న్నీళ్లు పెట్టుకున్న తొలి మ‌హిళ‌గా హేమ రికార్డుల‌కెక్కారు.

Full View
Tags:    

Similar News