ఆ రీమేక్ మూవీ 2021 ఎన్నిక‌ల్లో గెలిపిస్తుందా?

Update: 2020-08-24 00:30 GMT
చ‌ట్టం ఎప్పుడూ బ‌ల‌వంతుడి చుట్టం. దానిలోని లొసుగుల్ని వాడుకుని ఎంత‌కైనా తెగించే ఒక సెక్ష‌న్ సంఘంలో ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ప‌వ‌ర్ ప్యాక్డ్ సంప‌న్న‌ సెక్ష‌న్ పెద్ద మ‌నుషులు ఉత్త‌రాదిన ఒకానొక కాలంలో పాల్ప‌డిన దౌర్జ‌న్య‌కాండను ద‌ళిత యువ‌తుల అత్యాచార ఘ‌ట‌న‌ల్ని తెర‌పైకి తెస్తూ రూపొందించిన బాలీవుడ్ చిత్రం ఆర్టిక‌ల్ 15.

ఆయుష్మాన్ ఖురానా కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్ గా న‌టించారు. ఓవైపు కింది అధికారి కేసు ద‌ర్యాప్తు చేస్తుంటే నిజాలు నిగ్గు తేలుస్తూంటే అడుగడుగునా ఎలాంటి ఆటంకాలు ఎదుర‌య్యాయి? అన్న‌ది తెర‌పై అద్భుతంగా చూపారు. పై అధికారిగా వ‌చ్చే ప్ర‌కాష్ రాజ్ ఆ కేసును మాఫీ చేసేందుకు ఎలాంటి ప్యాకేజీ మాట్లాడుకున్నాడు? అన్న‌ది చూపించ‌డం ఆస‌క్తిక‌రం.

అంటరానితం.. దళిత యువతుల గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించిన పలు నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన  ఈ చిత్రం కమర్షియల్ గానూ ఘ‌న‌విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని సౌత్ లో ఉద‌య‌నిధి స్టాలిన్ క‌థానాయ‌కుడిగా రీమేక్ చేస్తున్నారు. అరుణరాజా కామరాజ్ ద‌ర్శ‌కుడు. రెడ్ జెయింట్ మూవీస్- బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి (బోనీ కపూర్), మరియు జీ స్టూడియోలు సంయుక్తంగా ఈ తమిళ రీమేక్ ను నిర్మించనున్నాయి. త్వ‌ర‌లో సెట్స్ కెళ్ల‌నున్నారు. 2021 ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్న స్టాలిన్ డీఎంకే పార్టీ యువ‌జ‌న కార్య‌ద‌ర్శి అన్న సంగ‌తి తెలిసిందే. స‌రైన టైమింగులో స‌రైన క‌థాంశాన్ని ఎంపిక చేసుకుని బ‌రిలో దిగుతున్నాడ‌న్న‌మాట‌.


Tags:    

Similar News