90ల్లో సౌత్ ఇండియాలో అత్యధిక లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అరవింద్ స్వామి పేరు ముందుండేది. స్టార్ హీరోలకు ఆటోమేటిగ్గా వచ్చే క్రేజ్ ను పక్కనబెట్టేస్తే.. అలాంటి ఇమేజ్ లేకుండానే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ అందాల హీరో. రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇస్తూ ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించిన అరవింద్.. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయాడు. కొన్నేళ్ల పాటు పూర్తిగా లైమ్ లైట్లో లేని అరవింద్.. తన గాడ్ ఫాదర్ మణిరత్నం తీసిన ‘కడలి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా నిరాశ పరిచినా.. ‘తనీ ఒరువన్’ అరవింద్ స్వామిని ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్... విలన్ పాత్రలకు మాంచి ఛాయిస్ అయ్యాడు అరవింద్.
ప్రస్తుతం ‘తనీ ఒరువన్’ తెలుగు వెర్షన్ ‘ధ్రువ’లోనూ విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద్.. తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఐతే వీటన్నింటికీ మించి అరవింద్ కెరీర్లోనే బిగ్గస్ట్ ఛాన్స్ కొట్టేశాడని కోలీవుడ్ సమాచారం. అతడికి ఓ హాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కిందట. ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’ సినిమా తీసిన స్టూడియో ప్రతినిధులు అతడితో సంప్రదింపులు జరుపుతున్నారట. తాము తీయబోయే ఓ ఫాంటసీ సినిమాకు అరవింద్ ను అడుగుతున్నారట. ఆ సినిమాలో అరవింద్ నటించడం దాదాపు ఖాయం అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లొచ్చు. అరవింద్ ఈ సినిమాలో నటించడం ఖరారైతే.. రజినీకాంత్.. టబు.. నాజర్.. మాధవన్ లాంటి హాలీవుడ్లో నటించిన అతి కొద్ది సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల్లో ఒకడవుతాడు.