తన తండ్రి ఎంఆర్ రాధ బయోపిక్ ను రూపొందించనున్నారట నటీమణి రాధిక. ఈ మేరకు ఆమె అందుకు హీరోని కూడా ఎంపిక చేసేసింది. శింబు ను టైటిల్ రోల్ లో పెట్టి తన తండ్రి బయోపిక్ ను రూపొందించనుందట రాధిక. తమిళనాట ఒకనాటి ప్రఖ్యాత నటుడు ఎంఆర్ రాధ.
వ్యంగ్యంతో కూడిన విలనిజాన్ని పండించడంలో మేటిగా పేరు పొందారు. అలా నటుడిగా హీరోలతో సమానమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారాయన. అన్నింటికి మించి ఎంజీఆర్ పై ఎంఆర్ రాధ కాల్పుల ఉదంతం సంచలనం రేపింది. తమిళ చిత్ర పరిశ్రమకు అదో సంచలన అంశం. అలాంటి అంశాన్నింటినీ ఎంఆర్ రాధ బయోపిక్ లో ప్రస్తావించనున్నారట.
రాధన్ మీడియా వర్క్స్ పతాకంపై రాధిక ఈ సినిమాను రూపొందించనుంది. ఎంఆర్ రాధ మనవళ్లలో ఒకడైన ఐకీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర కూడా ఉంటుందని ప్రకటించి - ఆ పాత్రకు అరవింద్ స్వామిని తీసుకున్నట్టుగా తెలిపారు రూపకర్తలు.
ఎంఆర్ రాధ వారసులు తమిళ సినీ రంగంలో బాగా సెటిలయ్యారు. రాధిక - నిరోషలు ఎంఆర్ రాధా కూతుళ్లు. రాధిక - నిరోషల తల్లులు వేరు. తండ్రి ఒక్కరే. ఇక రాధా రవి తమిళనాట ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. ఆయన రాధికకు అన్న. రాధా రవి తనయుడు కూడా నటుడిగా గుర్తింపును కలిగి ఉన్నాడు. రాధిక హీరోయిన్ గా - నిర్మాత - దర్శకురాలిగా కలిగిన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.