తమిళంలో ఆర్య ఒకప్పుడు సూపర్ హీరో. కానీ గత కొన్నేళ్లలో అతడి ఫాలోయింగ్ బాగా పడిపోయింది. వరుస ఫ్లాపుల కారణంగా రేసులో బాగా వెనుకబడిపోయాడు ఆర్య. చివరికి హీరోగా చెప్పుకోదగ్గ అవకాశాలే లేని పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అతను కోలీవుడ్లో విలన్ అవతారం ఎత్తేస్తున్నాడు.
విశాల్ హీరోగా మిత్రన్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ‘ఇరుంబు తిరై’ సినిమాలో ఆర్య విలన్ పాత్ర పోషించబోతున్నాడు. విశేషం ఏంటంటే విశాల్-ఆర్య హీరోలుగా ఒకప్పుడు ‘అవన్ ఇవన్ (వాడు వీడు) అనే సెన్సేషనల్ మూవీ చేశారు. ఆ సినిమాలో అన్నదమ్ములుగా వాళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ ఇద్దరూ హీరో-విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించబోతుండటం మరో విశేషం. జనతా గ్యారేజ్ తర్వాత కొన్నాళ్ల పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోని సమంత.. ఈ మధ్యే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.
మరోవైపు సమంత తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘2 స్టేట్స్ రీమేక్ లో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా అఫీషియల్ న్యూస్ ఏమీ రాలేదు. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో కన్నడ మూవీ ‘యు టర్న్’ రీమేక్ ను చైతూనే నిర్మిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ‘యు టర్న్’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే చైతూ-సామ్ కలిసి వెళ్లి చూసి రీమేక్ రైట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు అప్పట్లో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/