ఆ దర్శకులను కలుస్తున్న ఆర్యన్‌ రాజేష్‌

Update: 2019-01-10 08:06 GMT
ప్రముఖ దర్శకుడు ఈవీవీ తనయుడిగా సినిమాల్లోకి హీరోగా తెరంగేట్రం చేసిన ఆర్యన్‌ రాజేష్‌ అలరించడంలో విఫలం అయ్యాడు. మంచి రూపం ఉన్నా కూడా అదృష్టం లేక పోవడం వల్లో లేక మరేంటో కాని ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా సెట్‌ కాలేక పోయాడు. హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌ లే ఉండటంతో మెల్ల మెల్లగా ఆఫర్లే కనుమరుగయ్యాయి. దాంతో చాలా ఏళ్లు ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటూ వచ్చాడు. మళ్లీ ఇన్నాళ్లకు ‘వినయ విధేయ రామ’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

వినయ విధేయ రామ చిత్రం తర్వాత వరుసగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించాలని ఆర్యన్‌ రాజేష్‌ భావిస్తున్నాడు. అందుకోసం తనకు పరిచయం ఉన్న దర్శకులను కలుస్తున్నాడు. క్యారెక్టర్‌ రోల్స్‌ కు సిద్దమంటూ పరిచయం ఉన్న దర్శకులతో చెబుతున్నాడు. తాజాగా శ్రీనువైట్లను కలిసి ఆర్యన్‌ రాజేష్‌ తనకు క్యారెక్టర్‌ రోల్స్‌ ఇవ్వాలని కోరాడంటూ సమాచారం అందుతోంది. ఇండస్ట్రీలో హీరోలుగా అవకాశాలు లేని వారు క్యారెక్టర్‌ రోల్స్‌ ను చేయడం చాలా కామన్‌. కాని అతి కొద్ది మంది మాత్రమే క్యారెక్టర్‌ రోల్స్‌ తో బిజీ అయ్యారు.

హీరో జగపతిబాబు ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో భాగంగా విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దూసుకు పోతున్నాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. అలా తాను కూడా క్యారెక్టర్‌ రోల్స్‌ తో బిజీ అవ్వాలని ఆర్యన్‌ రాజేష్‌ కోరుకుంటున్నాడు. వినయ విధేయ రామలో ఆర్యన్‌ తన పాత్రతో మంచి గుర్తింపు దక్కించుకుని సెకండ్‌ ఇన్నింగ్స్‌ తో మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.



Full View
Tags:    

Similar News