రాంచరణ్ తో అర్యన్ రాజేశ్..అసలు కథ ఇదే..

Update: 2018-08-03 09:44 GMT

బోయపాటి శ్రీనివాస్.. కనుమరుగైపోయిన పాత నటులను ప్రోత్సహించి.. వారికి అవకాశమిచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ చేస్తున్న దర్శకుడీయన.. బోయపాటి తన ‘లెజెండ్’ సినిమాలో ఒకప్పటి హీరో జగపతి బాబును విలన్ గా నటింపచేసి అతడికి గొప్ప లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు జగపతి బాబు టాలీవుడ్ తోపాటు దక్షిణాదిని నంబర్ 1 విలన్ గా  నిలదొక్కుకున్నాడు. శ్రీకాంత్ - ఆది పినిశెట్టి లాంటి వారిని కూడా బోయపాటే తన సినిమాలతో ప్రోత్సహించాడు. అలాంటి బోయపాటి తన కొత్త చిత్రంలో మరో హీరోకు లైఫ్ ఇవ్వబోతున్నాడు..

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు అర్యన్ రాజేశ్ ‘హాయ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. రాజేశ్ తో ఈవీవీ కూడా పలు సినిమాలు తీసినా వర్కవుట్ కాలేదు. అర్యన్ చివరగా నటించిన ‘లీలా మహల్ సెంటర్’  - ఎవడిగోలవారిదే’ సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో వరుస ఫ్లాపులతో దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరగైపోయాడు. ఈవీవీ హఠాన్మరణం తర్వాత అసలు సినిమాల్లోనే కనిపించడం లేదు.

కాగా ఇప్పుడు బోయపాటి మళ్లీ అర్యన్ రాజేశ్ కు లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలో అర్యన్ రాజేశ్ కోసం ఓ మంచి పాత్రను డిజైన్ చేశాడట బోయపాటి. ఇది పూర్తి నెగెటివ్ రోల్ అట.. వివేక్ ఓబెరాయ్ ప్రధాన విలన్ కాగా.. అర్యన్ ఈ సినిమాలో ప్రత్యేక మైన పాత్రలో నటిస్తాడట..ఈ సినిమా అర్యన్ సినిమా కెరీర్ ను ఖచ్చితంగా మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న రాజేష్ కు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News