యంగ్ హీరో నాని ఏప్రిల్ 23న 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నిన్ను కోరి సినిమా హిట్ అయ్యింది. అందుకే నాని అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇటీవల భారీ పబ్లిసిటీ చేసిన సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. అందుకే ఈ సినిమాను కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నాలుగు భారీ ఈవెంట్ లను ప్లాన్ చేశారు.
సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలు ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు పబ్లిక్ ఈవెంట్ లను అనుకున్నారు. మొదటిది నిన్న పూర్తి అయ్యింది. ఈ సమయంలో మిగిలిన మూడు ఈవెంట్ లు ఎక్కడ ఏంటీ అనే విషయమై చర్చలు జరుపుతున్న సమయంలో కరోనా ఉదృతం అవుతున్న కారణంగా ప్రభుత్వాలు పబ్లిక్ ఈవెంట్ లపై ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున జనాలు గుమ్మి గూడే కార్యక్రమాలను తగ్గించుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు చేశాయి. తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి. పబ్లిక్ ఈవెంట్స్ లో సామాజిక దూరం అంటే సాధ్యం అయ్యే పని కాదు. అందుకే టక్ జగదీష్ పబ్లిక్ ఈవెంట్స్ ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశంగా మారింది.