యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన బయోపిక్ 'మేజర్'. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ముంబై దాడుల నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఓ రియల్ హీరో స్టోరీగా సంచలనం సృష్టించింది. దాదాపు 32 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మూడు భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి అడివి శేష్ కెరీర్ లోనే వసూళ్ల పరంగా ఆల్ టైమ్ రికార్డుని సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో కలిసి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ పై స్టార్ హీరో మహేష్ బాబు, A + S Movies బ్యానర్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీతో సంచలన విజయం సాధించడంతో న్యూమేకర్స్ A + S Movies అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలకు మంచి గుర్తింపు లభించింది.
టాలీవుడ్ లో విభిన్నమైన సినిమాల మేకర్స్ గా ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. తొలి ప్రయత్రంలోనే రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా సినిమా చేయడం, ఆ ప్రాజెక్ట్ కి ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో పాటు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకోవడంతో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రల పేరు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపించడం మొదలైంది.
ఈ మూవీ రిలీజై నెలలు కావస్తున్నా వీరి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటన రాలుదు. తాజాగా శనివారం అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు న్యూ ఫిల్మ్ మేకర్స్ కి గుడ్ న్యూస్ వినిపించారు. తదుపరి ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నామని ప్రకటిస్తూనే న్యూ టాలెంట్స్ కి వెల్కమ్ అంటూ ఓ ఆసక్తికరమైన ప్రకటనని విడుదల చేశారు.
ఓ నిర్మాణ సంస్థగా కొత్త ఆలోచనలతో, విజన్ తో వచ్చే వారి ఆలోచనలని బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి సిద్ధంగా వున్నామని, మీ దగ్గర ఆసక్తికరమైన, విలువైన స్క్రిప్ట్ వుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి అంటూ వెల్లడించారు. మరి ఈ ప్రొడ్యూసర్స్ అందిస్తున్న సువర్ణావకాశాన్ని ఎంత మంది మేకర్స్ సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.