రామ్ చరణ్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయిపోయింది. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ రీమేక్ కోసం.. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయిపోవడంతో.. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఒక్కో సంగతి బయటకు వస్తోంది. టైటిల్ విషయంలో ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదని యూనిట్ అంటున్నా.. 'ధృవ' అనే పేరుకు చరణ్ మొగ్గు చూపించాడని అంటున్నారు.
అయితే.. హీరో, విలన్ మధ్య ఆడే మైండ్ గేమ్ ఈ మూవీ ప్రధాన స్టోరీ కావడంతో.. ఈచిత్రంలో ఫోటోగ్రఫీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే చరణ్ కోసం బాలీవుడ్ నుంచి టాప్ ఫోటోగ్రాఫర్ తీసుకొస్తున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అసీం మిశ్రా.. చెర్రీ మూవీకి వర్క్ చేయనున్నాడు. సల్మాన్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ - అర్జున్ కపూర్ ల చిత్రాలకు రెగ్యులర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది. రీసెంట్ గా భజరంగీ భాయ్ జాన్ - దబాంగ్ 2లతో పాటు ఏక్ థా టైగర్ -. పాన్ సింగ్ తోమర్ - ఫాంటమ్ - బ్యాండ్ బాజా బారాత్ లకు కూడా కెమేరా వర్క్ చూసుకున్నది ఈయనే. ఈ సినిమాల్లో కెమేరా పనితనం చూసే.. అసీంకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ధృవ కోసం.. రామ్ చరణ్ స్టైలింగ్ కూడా పూర్తిగా మారిపోనున్నట్లు తెలుస్తోంది. లుక్ విషయంలోనూ కేర్ తీసుకుని కొత్తగా కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా.. మార్చ్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ప్రారంభించుకోనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనుండగా.. చెర్రీతో రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా రెండోసారి జత కట్టనుంది. తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న అరవింద్ స్వామి.. ఈ మూవీలో విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం జూలై చివర్లో కానీ.. ఆగస్ట్ లో కానీ రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.