స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ముక్కుసూటి వ్యవహారం గురించి చెప్పాల్సిన పనిలేదు. టాపిక్ ఏదైనా నచ్చలేదు అంటే? నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన శైలి. ఈ విషయంలో ఎంతటి వారైనా ఆయనకు అనవసరం. తాను చెప్పాలనుకున్నది? సుత్తి లేకుండా సూటిగా నిర్మొహమాటంగా చెప్పేస్తారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ని సైతం విమర్శించిన సంగతి తెలిసిందే. ఆమధ్య చినజీయర్ స్వామిపైనా దత్ నిప్పులు చెరిగారు. టాలీవుడ్ బంద్ పైనా తనదైన శైలిలో స్పందించారు. హీరోల పారితోషికాల విషయంపై సినిమా నిర్మాణం ఆపేయడమేంటి? పిచ్చిపని అంటే ఎద్దేవా చేసారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో `మహానటి` సినిమా కథాకమామీషు గుర్తు చేసుకున్నారు.
ఇందులో మొదటగా సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ కి బధులుగా వేరే నటిని అనుకున్నట్లు రివీల్ చేసారు. కానీ ఆమెతో వివాదం రావడంతో ఉన్నపళంగా ఆ నటిని తప్పించి కీర్తి సురేష్‌ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ నటిని ఎందుకు తీసేసారు అన్న విషయాన్ని రివీల్ చేసారు. మహానటిలో కొన్ని తాగుడు సీన్లు ఉన్న సంగతి తెలిసిందే.
సావిత్రి జీవితం ముగిసిపోవడానికి కూడా ఆ మత్తుకి బానిస అవ్వడమే. అయితే ఇలాంటి సీన్లు చేయనని... వాటిని తీసేయాలని కోరిందిట ఆనటి. కానీ అందుకు దత్ ఒప్పుకోలేదుట.
అంత కీలకమైన సన్నివేశాలు తొలగిస్తే సినిమాలో ఇంకేముంటుంది? అయినా స్ర్కిప్ట్ ని జడ్జ్ చేయడానికి ఆమె ఎవరు? వెంటనే ఆమెను తప్పించి మరో నటిని ఎంపిక చేయండని నాగ్ అశ్విన్ కి చెప్పడంతో వెంటనే ఆ నటిని తొలగించి కీర్తి సురేస్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మహానటిలో ముందు అనుకున్న నటి గనుక చేసి ఉంటే ఆ నటికి మంచి పేరొచ్చేదని..అనవసరంగా అతిగా ఆలోచించి ఛాన్స్ కోల్పోయిందని గుర్తచేసారు దత్. అయితే ఆ నటి ఎవరు? అని ప్రశ్నించగా దత్ చెప్పడానికి నిరాకరించారు. కానీ ఆ నటి నిత్యామీనన్ అని అప్పట్లో ప్రచారం సాగింది. మరి వాస్తవాలు ఏంటో తెలియాలి.
నిత్యామీనన్ ఇప్పటికే ఓ సినిమాలో మద్యం షాపులో బీయర్ బాటిల్ కొన్న ఓ సీన్ లో నటించింది. మందు తాగకుండానే మత్తెక్కించే సన్నివేశాల్లోనూ నటించింది. అయితే అవన్నీ సరదా సన్నివేశాలు. మహానటి లో అవే సన్నివేశాలు చాలా ఇంపాక్ట్ గా ఉంటాయి. అందుకే ఛాన్స్ తీసుకోలేదేమో. కానీ అదే ఛాన్స్ కీర్తి సురేష్ తీసుకుని పాన్ ఇండియాలో ఫేమస్ అయింది.