MAA రాజ‌కీయాల‌పై అశ్వ‌నిద‌త్ ఆందోళ‌న‌

Update: 2021-06-30 06:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ప్ర‌హ‌స‌నం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. ఆరుగురు స‌భ్యులు అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్నేయ‌డంతో ఎవరికి వారు గ్రూపు రాజ‌కీయాలు చేస్తుండ‌డం చ‌ర్చ‌కు తావిస్తోంది. ఒక ర‌కంగా పోటీవాతావ‌ర‌ణంలో వ‌రుస వివాదాల‌తో మ‌రో డ‌ర్టీపిక్చ‌ర్ ని త‌ల‌పిస్తోంద‌న్న ఆవేద‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆర్టిస్టుల సంఘంలో వివాదాలు ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చాయ‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.  

ఇప్పుడు మా అసోసియేష‌న్ ఉనికికి అస్థిత్వానికి ముప్పు వాటిల్లింద‌ని ఈ ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ రంగు పులమ‌డం స‌రికాద‌ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నిద‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇవి కేవ‌లం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని న‌టీన‌టుల‌కు చెందిన ఎన్నిక‌లు. దీనిలోకి పార్టీలు రాజ‌కీయ గొడ‌వ‌లు ప్రాంతీయ‌త భ‌య‌పెడుతున్నాయ‌ని అన్నారు.

తెరాస‌.. భాజ‌పా అంటూ లేనిపోని రాద్ధాంతం దేనికి?  ప్రాంతీయ వ్య‌త్యాసాలు తెర‌పైకి తెస్తారెందుకు? అని కూడా ద‌త్ ప్ర‌శ్నించారు. గ‌తంలో పసుపుకొమ్ము లాంటి రాష్ట్రాన్ని విభ‌జించారు. ఆంధ్రా- తెలంగాణ అంటూ ఉద్య‌మాలు చేశారు. అయిన దానికి కాని దానికి గొడ‌వ‌లు సృష్టించారు.. ఇప్ప‌టికీ  ఏ ప్రాంతం వాళ్లని అక్కడికి పొమ్మని... అక్కడే షూటింగ్స్‌ చేసుకొమ్మనే దురదృష్టకరమైన స‌న్నివేశాన్ని సృష్టించారు! అని కూడా అశ్వ‌నిద‌త్ అన్నారు. మా ఎన్నిక‌ల్లో ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సినీప‌రిశ్ర‌మ మూల‌స్థంబాలు అయిన చిరంజీవి-మోహన్ బాబు- బాలకృష్ణ- నాగార్జున వంటి వారు ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రిస్తార‌ని ద‌త్ అన్నారు. ద‌త్ ఆందోళ‌న చూస్తుంటే ప‌రిశ్ర‌మ భ‌విష్య‌త్ పైనా సందేహం క‌లుగుతోంది.
Tags:    

Similar News