కింగ్‌ ఖాన్‌ ని ట్రాఫిక్ పోలీస్‌ ని చేశారు

Update: 2018-07-29 04:27 GMT
ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌లో భార‌తీయులు మ‌హా ఘ‌నులు అని స‌ర్వేలు చెబుతుంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఓవైపు డ్యూటీ చేస్తున్నా, అదేమీ ప‌ట్ట‌న‌ట్టు సిగ్న‌ల్ జంప్‌ లు చేసేవాళ్లున్నారు. అస‌లు రూల్స్ ఉండేది మ‌న‌కు కాదులే అన్న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దీనిపై ఇటీవ‌లే రిలీజైన `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో సెటైరిక‌ల్ వేలో ఓ స‌న్నివేశాన్ని చూపించాడు కొర‌టాల శివ. అర‌నిమిషమే వ‌చ్చినా ఆ సీన్ మ‌తి చెడ‌గొట్టింది.

అదంతా అటుంచితే ఎప్పుడో జ‌మానా కాలంలో రిలీజైన కింగ్ ఖాన్‌- కాజోల్‌ ల బ్లాక్బ‌స్ట‌ర్ మూవీ `కుచ్ కుచ్ హోతా హై` నేటి అస్సామీ పోలీసుల‌కు చ‌క్క‌ని దారి చూపించింది. ఈ సినిమాలో షారూక్ ఫోజు ఒక‌టి ట్రాఫిక్ కూడ‌ళ్ల‌లో గ్రాఫిక్ ప్లేట్‌ పై డిస్‌ప్లే చేయ‌డం ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయాల‌న్న ఆలోచ‌న చేశారు అస్సామీ పోలీస్ క‌మిష‌న‌ర్‌. దానిని సామాజిక మాధ్య‌మాల ద్వారాను ప్ర‌చారం చేస్తే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. `ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్‌` అని ట్యాగ్‌ లైన్‌ తో షారూక్ పోస్ట‌ర్‌ని ఉప‌యోగించారు. త‌మ అభిమాన స్టార్ ఇలా చెబుతుండ‌డంతో అది జ‌నాల‌కు బాగా క‌నెక్ట‌య్యిందిట‌. ఈ ట్రిక్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ``కుచ్ కుచ్ హోతా హై రాహుల్‌ - తుమ్ న‌హిన్ స‌మ్‌ జోగే..`` అన్న డైలాగ్‌ ని  .. ట్రాఫిక్ రూల్స్ కి ఉప‌యోగించారు. `ట్రాఫిక్ నియ‌మోం కా పాల‌న్ న‌హిన్ క‌ర్నే సే కుచ్ - కుచ్ న‌హిన్‌ - బ‌హుత్ కుచ్ హోతా హై`` (ట్రాఫిక్ రూల్స్ అనుస‌రించ‌క‌పోతే - ఏదో కాదు చాలానే ఎదుర్కోవాల్సి ఉంటుంది!) అన్న వార్నింగ్‌ని సింబాలిక్‌ గా గ్రాఫిక్ విజువ‌ల్‌ ప్లేట్‌ లో ప్ర‌చారం చేశారు. ఇది ఓ రేంజులో వ‌ర్క‌వుట‌వుతోందిట‌.
Tags:    

Similar News