కొత్త ఖజానాతో మాళవిక గాలం

Update: 2022-11-27 07:36 GMT
మాళవిక మోహనన్ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి.. అక్కడ ఆమె చేసే అందాల విందు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త థీమ్స్‌తో హాట్ హాట్ ఫొటో షూట్లు చేయడం ఆమెకే చెల్లు.

బాలీవుడ్లో దిశా పఠాని ఈ హాట్ పొటో షూట్లలో ఐకాన్ అయితే.. సౌత్ ఇండియా వరకు మాళవికనే క్వీన్ అని చెప్పాలి. ఆమె స్టైలింగ్ కానీ.. ఫొటో షూట్ థీమ్స్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. ఇక మాళవిక ఫిజిక్ గురించి.. ఆమె చేసే స్కిన్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ విషయంలో ఆమె ఎవ్వరితోనైనా పోటీ పడగలదు. అందాలు ఉంటే సరిపోదు.. వాటిని సరిగా ప్రదర్శించడం కూడా ఒక కళ. ఇందులో బాగా ఆరితేరిన మాళవిక.. తాజాగా సూపర్ సెక్సీ అవతారంలో పొటో షూట్ చేసి తన ఫాలోవర్ల టైమ్ లైన్‌లలో వేడి పుట్టించేసింది.

బుట్టలో పళ్లు దాచినట్లుగా తన అందాల ఖజానాను బట్టల్లో పట్టించడానికి చాలానే కష్టపడింది మాళవిక. ఆమె ఫొటోల కింద కుర్రాళ్ల కామెంట్లు చూస్తే ఆమె ఎంతగా వాళ్లకు వెర్రెత్తిస్తోందో అర్థమవుతుంది. కెరీర్ పరంగా ఆమెకు ఇది చాలా కీలకమైన సమయం.

'మాస్టర్' మినహా సరైన సినిమా ఛాన్స్ దొరక్క ఇబ్బంది పడుతూ వచ్చిన మాళవిక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో జోడీ కడుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ కొత్త చిత్రంలో మాళవిక ఒక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లిక్ అయితే మాళవిక పాన్ ఇండియా లెవెల్‌కు తన ఫాలోయంగ్‌ను విస్తరించడం ఖాయం.
Tags:    

Similar News