సమంతలా నయనతారకు విడాకులు తప్పవట..!

Update: 2022-05-12 07:30 GMT
సుదీర్ఘ కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య మరియు సమంతలు వైవాహిక జీవితంను కొనసాగించలేక విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. సమంత చైతూ మాదిరిగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నయనతార మరియు విఘ్నేష్ శివన్‌ లు కూడా వైవాహిక జీవితంను కొనసాగించలేక.. గొడవల కారణంగా విడిపోతారు అంటూ జ్యోతిష్య శాస్త్రం చెబుతుందట.

ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయిన వేణు స్వామి తాజాగా ఈ విషయాన్ని తెలియజేసి సంచలనంగా నిలిచాడు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వేణు స్వామి వ్యాఖ్యలను జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు.. కాని గతంలో సమంత మరియు నాగ చైతన్య పెళ్లి సందర్బంలో కూడా ఈయన అలాంటి వ్యాఖ్యలే చేశాడు.

సమంత మరియు నాగ చైతన్యలకు పెళ్లి జరిగితే ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదు అంటూ అప్పట్లోనే వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియాలో పబ్లిసిటీ కోసం ఆయన చేస్తున్న వ్యాఖ్యలని అంతా భావించారు. సమంత మరియు నాగ చైతన్య విడాకుల ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆయన గురించి చర్చ మొదలు అయ్యింది. మళ్లీ ఇప్పుడు అదే చర్చ వేణు స్వామి గురించి జరుగుతోంది.

జూన్‌ 9వ తారీకున పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నయనతార మరియు విఘ్నేష్‌ శివన్ లు ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నయనతారకు వివాహం కలిసి రాదని.. ఆమెకు గురుడు నీచ స్థితిలో ఉన్నాడు. అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు.. గొడవలు జరిగే అవకాశం ఉంది.. తద్వార భర్త నుండి విడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు.

శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఈ అపశకునపు వ్యాఖ్యలు ఏంటీ స్వామి అంటూ చాలా మంది ఆయన్ను విమర్శిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను నమ్ముతున్నారు. గతంలో నాగ చైతన్య మరియు సమంత విషయంలో ఈయన వ్యాఖ్యలు నిజం అయ్యాయి కనుక నయనతార కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అంటూ సలహాలు ఇస్తున్న వారు ఉన్నారు.

ఇంతకు వేణు స్వామి వ్యాఖ్యలు ఆమె వరకు వెళ్లి ఉంటాయా.. అప్పుడు నయన్‌ లేదా విఘ్నేష్ శివన్‌ ఎలా స్పందిస్తారు చూడాలి. ఈయన కేవలం సమంత.. నయనతారలకు మాత్రమే కాకుండా స్టార్‌ హీరోయిన్స్ అయిన రష్మిక మందన్నా.. అనుష్క.. ఇంకా కొందరికి కూడా వైవాహిక జీవితం అచ్చి రాదు.. వారు పెళ్లి చేసుకోకుంటేనే మంచిది అంటూ సూచిస్తున్నాడు.
Tags:    

Similar News