రివ్యూ: అసుర
రేటింగ్: 3 /5
తారాగణం: నారా రోహిత్, ప్రియా బెనర్జీ, రవి వర్మ, మధు, రామారావు, సత్య, భాను అవినేని తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
నిర్మాత: శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్
రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్
ప్రస్తుతం టాలీవుడ్ యువ కథానాయకుల్లో నారా రోహిత్‌ది ప్రత్యేకమైన శైలి. తొలి సినిమా 'బాణం' దగ్గర్నుంచి భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నాడు రోహిత్. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీఫెలో.. ఇలా అతడి సినిమాల వరస చూస్తే ఏదో కొత్తగా ట్రై చేయాలన్న తపన కనిపిస్తుంది. రోహిత్ కొత్త సినిమా 'అసుర' కూడా అతడి గత సినిమాల్లాగే ఆసక్తి రేపింది. కొత్త దర్శకుడు కృష్ణ విజయ్ రూపొందించిన ఈ సినిమా ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా? తనపై ఆశలు పెట్టుకొచ్చిన ప్రేక్షకుల్ని రోహిత్ మెప్పించాడా? చూద్దాం పదండి.
కథ:
ధర్మ (నారా రోహిత్) నిజాయితీపరుడైన జైలర్. చెడును అస్సలు సహించడు. నోటితో చెప్పే మాటలకంటే చేత్తో చెప్పే మాటే బాగా గుర్తుంటుందని... రూల్స్ కంటే రిజల్ట్సే ముఖ్యమని నమ్మే వ్యక్తి. తన జైలులో ఏ చిన్న తప్పిదం జరగడానికి వీల్లేదని భావించే ధర్మకు అప్పుడే ఆ జైల్లోకి వచ్చిన చార్లీ (రవి వర్మ)తో సమస్య మొదలవుతుంది. ఐదేళ్లుగా వాయిదా పడుతున్న అతడి ఉరి శిక్షను ధర్మ అమలు చేయాల్సి వస్తుంది. ఐతే ఆ శిక్ష ఆపడానికి చార్లీ చేయాల్సిందంతా చేస్తాడు. చార్లీతో డీల్ కుదుర్చుకున్న ఓ గ్యాంగ్ ధర్మ ప్రేయసి హారిక (ప్రియా బెనర్జీ)ను, ఉరిశిక్ష అమలు చేయాల్సిన మేజిస్ట్రేట్ కొడుకుని, తలారి తల్లిని కిడ్నాప్ చేస్తారు. మరి వాళ్లందరినీ ధర్మ ఎలా కాపాడుకున్నాడు, చార్లీని ఉరికంభానికి ఎక్కించాడు.. అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ:
ముందే చెప్పుకున్నట్లు నారా రోహిత్ సినిమాలంటే భిన్నంగా ఉంటాయని.. అతడెంచుకునే కాన్సెప్ట్‌లు యునీక్‌గా ఉంటాయని ప్రేక్షకుల్లో ఓ నమ్మకముంది. ఐతే ఇంతకుముందు అతనెంచుకున్న కాన్సెప్ట్‌లు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి కానీ.. కమర్షియల్‌గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. 'అసుర' కొత్తగా ఉంటూనే, కమర్షియల్‌గానూ సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు రోహిత్. అతడిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ కాదు. 'అసుర' కాన్సెప్ట్ యునీక్‌గా ఉండటమే కాదు.. కమర్షియల్‌గా వర్కవుటయ్యే బిగువైన కథనం కూడా ఉందిందులో.
రోహిత్ గత సినిమాల్ని పరిశీలిస్తే.. వాటిలో కథలు చాలా సింపుల్‌గా ఉంటాయి. లైన్ చాలా థిన్‌గా ఉంటుంది. అసుర కూడా అలాంటిది. స్థూలంగా చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్న కథ. ఓ జైలర్.. అతడి జైలుకో ఉరిశిక్ష పడ్డ ఖైదీ వస్తాడు. అతను శిక్ష తప్పించుకోవడానికి గేమ్ మొదలుపెడతాడు. హీరో ఆ గేమ్‌ను ఎలా ఆపుతాడు.. అన్నది కథ. ఇంత చిన్న లైన్ మీద రెండు గంటల సినిమాను నడిపించడం చిన్న విషయం కాదు. ఐతే కొత్త దర్శకుడు కృష్ణ విజయ్.. కథ ఎలా ఉన్నా కథనంతో మ్యాజిక్ చేయొచ్చని రుజువు చేశాడు. తక్కువ నిడివిలో.. బలమైన సన్నివేశాలతో.. కథ నుంచి ఎక్కడా పక్కదారి పట్టకుండా.. సూటిగా సుత్తిలేకుండా కథనాన్ని నడిపించాడు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో భారీ ఇంట్రడక్షన్లు.. హీరోకిచ్చే బిల్డప్పులు.. మసాలా సాంగులు.. కామెడీ ట్రాకులు, డ్యూయెట్లు.. ఇలాంటివేమీ 'అసుర'లో కనిపించవు. బేసిక్ ప్లాట్ మీద తప్ప దర్శకుడు దేనిమీదా దృష్టిపెట్టలేదు. ప్రథమార్ధంలో వృథా అనదగ్గ సన్నివేశాలు కనిపించవు. హీరో క్యారెక్టరైజేషన్ గురించి తెలిపే సన్నివేశాలతో ఓ 20 నిమిషాలు నడిపించిన దర్శకుడు.. ఆ తర్వాత విలన్‌ను రంగంలోకి దించేశాడు. హీరో లవ్ ట్రాక్‌ను కూడా జీరో నుంచి మొదలుపెట్టలేదు. ఆ ఎపిసోడ్ ఒకరకంగా క్లైమాక్స్‌తో మొదలవుతుందని చెప్పాలి. విలన్ ఎంట్రీ ఇవ్వగానే.. ఉత్కంఠ మొదలై ఇంటర్వెల్ వచ్చేసరికే పతాక స్థాయికి చేరుతుంది. ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరిగేలా మంచి ట్విస్టుతో ప్రథమార్ధాన్ని ముగించాడు. ఫస్టాఫ్ గంట ఎలా గడిచిందో తెలియనంత వేగంగా అయిపోతుంది.
ఐతే ఇంటర్వెల్ ట్విస్టుకు తగ్గట్లుగా ద్వితీయార్ధం సాగదు. రెండోసారి ఉరిశిక్ష ఆగడానికి చూపించే కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది. దీంతో ఆసక్తి సడలుతుంది. ఆ తర్వాత కూడా బలమైన సన్నివేశాలు పడకపోవడంతో ద్వితీయార్ధం గాడితప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఐతే చివర్లో వచ్చే ట్విస్టుతో మైండ్ బ్లాంక్ అవుతుంది. అప్పటిదాకా సిల్లీగా అనిపించిన సన్నివేశాల విషయంలో కూడా కన్విన్స్ అయ్యేలా క్లైమాక్స్‌లో షాకిచ్చాడు దర్శకుడు. దీంతో అసుర మీద అప్పటిదాకా ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. దర్శకుడి తెలివికి శభాష్ అనుకుంటూ బయటికి వస్తాడు ప్రేక్షకుడు. రోహిత్ గత సినిమాల్లాగే ఇందులోనూ డైలాగులు అద్భుతంగా కుదిరాయి.
రెండు గంటల్లో షార్ప్‌గా సినిమాను ముగించేయడం కూడా తెలివైన ఎత్తుగడ. ఐతే మాస్ ఆడియన్స్ కోరుకునే కొన్ని అంశాలు 'అసుర'లో మిస్సయ్యాయి. ఇలాంటి సినిమాల నుంచి కామెడీ ఆశించడం తప్పే కానీ.. అది లేదని మాస్ ఆడియన్స్ కంప్లైంట్ చేయొచ్చు. హీరోయిన్ ట్రాక్‌ను ఇంకాస్త బాగా డెవలప్ చేయాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య ఏమాత్రం రొమాన్స్ లేకపోవడం కొందరికి నిరాశ కలిగించొచ్చు. హీరో రొమాన్స్ చేస్తే సీరియస్‌నెస్ తగ్గిపోతుందనుకున్నాడో ఏంటో.. దర్శకుడు ఆ ప్రయత్నమే చేయించలేదు. హీరో హీరోయిన్లు ఎలా లవ్‌లో పడ్డదీ కూడా చూపించలేదు. నేరుగా వాళ్లను ప్రేమికుల్లా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు లేకపోయాయి. ద్వితీయార్ధంలో తొలి అరగంట ఇంకాస్త బిగువుగా ఉండాల్సింది. ఉద్దేశపూర్వకంగా చూపించిన సన్నివేశాలే అయినా.. కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్టుతో ఈ తప్పులు కొట్టుకుపోయినా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది.
నటీనటులు:
నారా రోహిత్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దర్శకుడి ఆలోచనలకు వంద శాతం న్యాయం చేశాడు రోహిత్. పూర్తి సినిమాను తన భుజాల మీద నడిపించే సత్తా ఉందని మరోసారి రుజువు చేసుకున్నాడు రోహిత్. అతడి బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా పవర్‌ఫుల్ డైలాగులు, కవితలు చెప్పేటపుడు రోహిత్ తన ప్రత్యేకతను చూపించాడు. ఐతే ఫిజిక్, లుక్ విషయంలో రోహిత్ కొంచెం జాగ్రత్త పడాలని 'అసుర' కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలా కనిపిస్తే కష్టం. హీరోయిన్ ప్రియా బెనర్జీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ.. కనిపించే తక్కువ సన్నివేశాల్లో చలాకీగా నటించింది. రవివర్మలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయేలా నటించాడు. విలన్‌గా ఇంటన్సెటీని.. క్రూరత్వాన్ని కళ్లలో బాగా చూపించాడతను. మధు కూడా బాగా చేశాడు. కానిస్టేబుల్‌గా రామారావు, తలారిగా భాను అవినేని కూడా ఆకట్టుకున్నారు..
సాంకేతిక వర్గం:
దర్శకుడికి టేస్టుండాలే కానీ.. తాను ఎలాంటి సినిమాకైనా పని చేయగలనని చాటుకున్నాడు సాయికార్తీక్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కు చక్కగా సరిపోయే మ్యూజిక్ ఇచ్చాడతను. ఉన్న నాలుగు పాటలూ ఆకట్టుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఐతే కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించి లౌడ్‌నెస్ ఇబ్బంది పెడతుంది. కొన్ని చోట్ల కామ్‌నెస్ కూడా సన్నివేశానికి బలం చేకూరుస్తుందన్న సంగతి మర్చిపోయాడనిపిస్తుంది. విశ్వేశ్వర్ కెమెరా పనితనం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్లుంది. సినిమాకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడతను. రోహిత్ కవిత్వం చెప్పే సన్నివేశాల్లో కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకుడు కృష్ణ విజయ్.. తొలి చిత్రంతోనే బలమైన ముద్ర వేశాడు. స్క్రీన్‌ప్లేపై అతడి పట్టు కనిపిస్తుంది. ట్విస్టును డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కొన్ని చోట్ల వీక్‌గా కనిపించాడు కానీ.. ఓవరాల్‌గా సినిమాను బాగా డీల్ చేశాడు. దర్శకుడే రాసిన డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఒకటీ రెండని కాదు కానీ.. సినిమాలో చాలా చోట్ల డైలాగులు అద్భుతంగా పేలాయి. ''జైల్లో పక్షులకు రెక్కలొచ్చాయి.. కట్ చేస్తున్నా''.. ''బతకనివ్వని వాడికి బతికే హక్కు లేదు''.. ''చూడాల్సింది దగ్గర సంబంధం కాదు.. దగ్గరైన మనుషుల్ని''.. లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని.
చివరిగా...
కొత్తదనం కోరుకునే వారికి.. థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి.. 'అసుర' మంచి ఆప్షన్.