తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. రేపు విజేత ఎవరు అనేది తేలిపోతుంది. రేపు సాయంత్రం నుండి మారథాన్ ఎపిసోడ్ ప్రారంభం అవ్వబోతుంది. ఈ సీజన్ ఫినాలేకు స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాని ఇప్పటికే పలువురి పేర్లు మాత్రం ప్రచారం జరుగుతున్నాయి. సహజంగా అయితే ఫినాలే ఎపిసోడ్ కు ముందు వారం రోజులు కూడా కంటెస్టెంట్స్ పూర్తిగా రిలాక్స్ అయ్యేలా బిగ్ బాస్ టీమ్ చేస్తారు. వారు సరదాగా గడుపుతూ ఉంటారు. కాని ఈ సీజన్ లో మాత్రం ఫినాలే ఎపిసోడ్ ఒకటి రెండు రోజులు ఉండగా కూడా రచ్చ రచ్చ గొడవలను బిగ్ బాస్ పెట్టిస్తున్నారు.
ఈ సమయంలో ఈ గొడవలు ఏంటి బాసూ అన్నట్లుగా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 నిన్నట ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక సిల్లీ డ్రామా నడిపించాడు. టిఫిన్ మరియు లంచ్ విషయంలో ఇంటి సభ్యులు గొడవ పడుతున్న సమయంలో అనూహ్యంగా ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ తమ బ్యాగ్ లను సర్దేసుకుని మెయిన్ గేట్ వద్దకు రండీ అంటూ పిలవడం జరిగింది. ఆ సమయంలో ఇంటి సభ్యులు అంతా కూడా కాస్త గందరగోళం తో తమ తమ లగేజ్ ను పట్టుకుని వచ్చారు.
బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఈ క్షణంలోనే ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అంటూ ప్రశ్నించాడు. దాంతో ఒకొక్కరు ఒక్కో పేరు చెప్పారు. వారు చెప్పిన పేర్లతో సంబంధం లేదు అన్నట్లుగా సిరిని బిగ్ బాస్ మీరు ఇంటి నుండి బయటకు వెళ్లి పోవాల్సిందే అంటూ ప్రకటించాడు. ఆ సమయంలో సిరి వెళ్లేందుకు కాస్త మొండికేసింది. అప్పుడు షన్ను కన్నీరు కార్చుతూనే ఉన్నాడు. సిరి వెళ్లి పోదు అని ఒక వైపు నుండి సన్నీ బలంగా అంటూనే ఉన్నాడు.
కాని సిరి మాత్రం తాను వెళ్తున్నాను అన్నంత డ్రామా పండించి కన్నీళ్లు పెట్టుకుంది. షన్ను మరియు సిరి కి కూడా ఆ విషయం తెలుసు. అయినా కూడా వారు చేసిన డ్రామా అతి అయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఎవరు అలా అర్థాంతరంగా వెళ్లరు అనే విషయం ప్రతి ఒక్క బిగ్ బాస్ ప్రేక్షకుడికి కూడా తెలుసు. అంత చిన్న విషయం బిగ్ బాస్ లో ఉన్న వారికి తెలియకుండా ఉండదు. కాని సింపథీ కోసం ఏడుపు డ్రామా ఆడారు. బిగ్ బాస్ ఖచ్చితంగా మళ్లీ సిరిని లోనికి పంపిస్తాడని తెలుసు. అనుకున్నట్లుగానే మళ్లీ లోనికి పంపించాడు. ఈ మొత్తం వ్యవహారంలో సిరి మరియు షన్నులు మరీ ఓవర్ డ్రామాను ప్లే చేయగా.. ఇతర సభ్యులు మాత్రం చాలా కూల్ గా కనిపించారు.
బిగ్ బాస్ ఇలాంటి సిల్లీ ఎలిమినేషన్ లు పెట్టడం మానేస్తే బెటర్ అన్నట్టు కొందరు కామెంట్ చేస్తున్నారు. సీజన్ పూర్తి అయ్యే సమయంలో ఇలాంటి ఎలిమినేషన్ ను ఖచ్చితంగా ఎవరు ఊహించరు. ఒక వేళ అలాంటి ఎలిమినేషన్ చేసినా కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ ను జనాలు విపరీతమైన ట్రోల్స్ చేస్తారు. బిగ్ బాస్ నుండి ప్రేక్షకుల ఓట్ల ద్వారా తప్ప మరే ప్రాతిపధికన కూడా బయటకు పంపించరు.
వారు బలవంతంగా వెళ్తామంటే తప్ప ఇప్పటి వరకు తెలుగు సీజన్ లు అన్నింటిలో కూడా పంపించిన దాఖలాలు లేవు. అందుకే ఈ సారి కూడా ఎవరు వెళ్లరు అని అందరికి తెలుసు. అయినా కూడా బిగ్ బాస్ కాస్త డ్రామా ఆడించే ప్రయత్నం చేశాడు కాని ప్రేక్షకులు మరీ అంత పుష్పాలు కాదులే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.