బాహుబలి-2 మీద ఇంట్రెస్ట్ లేదేంటో!!

Update: 2017-04-24 17:30 GMT
రీసెంట్ గా జనాలు బాగా ఎదురుచూస్తున్న మూవీ ఏది అనే ఓ పోల్ నిర్వహిస్తే.. అందులో బాహుబలి ది కంక్లూజన్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇది హైలైట్ అనిపించచ్చు కానీ.. నిజానికి బాహుబలి మొదటి భాగానికి జనాల్లో ఉన్న క్యూరియాసిటీ ఏర్పడ్డ హైప్ తో పోలిస్తే.. ఇప్పుడు ఆ స్థాయిలో కనిపించడం లేదని చెప్పాలి. జనాల్లో అసలు ఇంట్రెస్ట్ తగ్గడానికి రీజన్ ఏమైయుంటుంది అంటారు?

బాహుబలి మొదటి భాగం రాక ముందు బాలీవుడ్ జనాలకు ఈ సినిమా తెలియదు. ఇప్పుడు అందరికీ డీటైల్స్ తెలుసు కాబట్టి.. కాసిన్ని ఎక్కువ ఓట్లు పడుండచ్చంతే. పబ్లిసిటీ విషయంలో కూడా బాహుబలి1 కోసం బోలెడంత వర్క్ చేశారు. రెండు నెలల ముందు నుంచి మొదలు పెట్టి.. ఒక్కో కేరక్టర్ కు లుక్స్.. చిన్న పాటి టీజర్ చొప్పున విడుదల చేస్తూ అంతంకంతకూ ఆసక్తిని రెట్టింపు చేస్తూ వచ్చారు. సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఇది పీక్ స్టేజ్ కి చేరుకుంది. కానీ బాహుబలి2 విషయంలో మాత్రం ఈ హంగామా గత నెలలో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మాత్రమే నెలకొంది.

అసలు చిన్న విషయం కూడా లీక్ కాకుండా దాదాపు రెండేళ్లు గడిపేసరికి.. ట్రైలర్ కు ఆ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ చూశాక జనాలకు ఓ అంచనా వచ్చింది. పైగా పబ్లిసిటీ యాక్టివిటీస్ లో అప్పటి క్రియేటివిటీ లేదు. జనాలు వాళ్లే చూస్తార్లే అన్న అలసత్వం మేకర్స్ లో కనిపిస్తోంది. ఇది మూవీ రిజల్ట్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలియాల్సి ఉంది. అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ ఉండకపోతే.. భారీ లాసులు వచ్చే ఛాన్సులు కూడా ఉందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News