మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఎనిమీ అనే టైటిల్ ని ఈ చిత్రానికి అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదంతా పాత సంగతే అయినా.. ఇప్పుడీ మూవీలో నటించేందుకు ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే ఆడిషన్స్ చేసేస్తూ.. మహేష్ తో యాక్ట్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చేస్తామంటున్నారు నిర్మాతలు. ఇదే అసలు సమస్యగా చెప్పుకోవాలి.
సమ్మర్ రిలీజ్ బ్రహ్మోత్సవం చిత్రానికి కూడా ఇలాంటి తతంగమే నడిపించారు. పెద్ద కుటుంబాలన్నీ కలిసి తమకు ఫొటోలు పంపించేస్తే.. వాళ్లను ఆడిషన్ చేసేసి బ్రహ్మోత్సవంలో నటించే అవకాశం ఇస్తామని చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల. నిజంగా ఆడిషన్స్ - సెలక్షన్స్ చేశారో లేదో తెలియదు. ఒకవేళ చేసినా.. ఆ సినిమాలో ఉన్న కేరక్టర్ ఆర్టిస్టుల మొహాలే తిన్నగా స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక మిగిలిన బెటాలియన్ ను ఏ మాత్రం చూపిస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీ సినిమా అనే బిల్డప్ కోసం అప్పట్లో ఈ హంగామా నడించింది.
బ్రహ్మోత్సవం కథ అయిపోయింది. ఇప్పుడు మహేష్ మూవీ ఎనిమీ కోసం మరోసారి కొత్త కబుర్లు స్టార్ట్ అయిపోయాయి. ఆడిషన్స్ అంటూ నానా హంగామా చేసేస్తున్నారు. ఒకవేళ వీళ్లను సెలక్ట్ చేసేసినా.. ఇది న్యాయవ్యవస్థపై తీస్తున్న సినిమా కాబట్టి.. కోర్టు సీన్లలో ఎదురుగా బెంచీలపై కూర్చోబెట్టి మమ అనిపిస్తారు. లేకపోతే కోర్టు బయట నుంచునే జనాల్లో ఉంటారనుకోవచ్చు. మరి ఈ మాత్రం దానికి ఆడిషన్స్ అంటూ హడావిడి నడిపిస్తుండడం ఆశ్చర్యకరం.