‘ఊహలు గుసగుసలాడే’ లాంటి అందమైన టైటిల్ తో దర్శకత్వ అరంగేట్రం చేశాడు అవసరాల శ్రీనివాస్. పేరెంత అందంగా ఉందో.. సినిమా కూడా అంతే అందంగా ఉండటంతో ప్రేక్షకులు మంచి విజయాన్నందించారు. ఐతే ఆ విజయాన్ని చూసుకుని అవసరాల అవసరపడిపోలేదు. హడావుడిగా సినిమా మొదలుపెట్టేయకుండా బాగా టైం తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చిన ‘వారాహి చలనచిత్రం’ బేనర్ లోనే తన రెండో సినిమా కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈసారి అతను మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ కూడా చాలా ఆసకక్తికరంగా ఉంది. తెలుగునాట జో అచ్యుతానంద జోజో ముకుందా అనే పాట తెలియని వారెవరుంటారు. ఈ పాటలోని పదాల్నే టైటిల్ గా పెడుతున్నాడు అవసరాల. అతడి కొత్త సినిమా పేరు.. జ్యో అచ్యుత ఆనంద.
ఈ టైటిల్ వెనుక ఆంతర్యమేంటో వివరించాడు అవసరాల. అచ్యుత రామారావు, ఆనంద్ వర్ధన్ రావు అనబడే ఇద్దరు అన్నదమ్ములు, వారికి కూతురు వరుసైన జ్యోత్స్న అనే అమ్మాయి.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథతో తన కొత్త సినిమా తెరకెక్కనుందని అవసరాల వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లను కలిపి ‘జ్యో అచ్యుత ఆనంద’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలిపాడు. మొత్తానికి టైటిల్ తోనే ఆసక్తి రేపాడు అవసరాల. ఈ నెల 17న వినాయక చవితి సందర్భంగా సినిమా ప్రారంభమవుతుందని.. ఆ సందర్భంగానే సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఓ ఆసక్తికర కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. అవసరాల తొలి చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరే దీనికీ సంగీతం అందించే అవకాశముంది.