బాలీవుడ్ మూవీ హంటర్ ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. ఈ అడల్ట్ కామెడీ మూవీలో దర్శకుడు కం హీరో అయిన శ్రీనివాస్ అవసరాల నటిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రానికి 'బాబు బాగా బిజీ' అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలాంటి టైటిల్ ని సెట్ చేసి.. కాన్సెప్ట్ ని చెప్పకనే చెప్పేశారు యూనిట్.
ఈ బాబు బాగా బిజీ కోసం హీరోకు ఇచ్చిన రెమ్యూనరేషన్ విషయం తెలిసి.. అందరికీ సౌండ్ఆఫ్ అయిపోతోంది. ఈ చిత్రంలో నటించి.. అవసరాల ఏకంగా 2 కోట్ల పారితోషికం అందుకున్నాడట. హీరోగా ఇంత మొత్తం అంటే.. అవసరాలకు ఎక్కువ మాటే. వరుస హిట్స్ ఉన్న మీడియం రేంజ్ హీరోలకు మాత్రమే ఇంత పేమెంట్ ముడుతోంది. దర్శకుడిగా చాలా క్రేజ్ ఉన్నా.. ఆర్టిస్టుగా మాత్రం ఇతనికి అంత ముట్టే రేంజ్ లేదు. మహా అయితే రోజుల లెక్కన లక్షలు పుచ్చుకుంటాడని చెబుతూ ఉంటారంతే.
కానీ హంటర్ రీమేక్ కోసం నిర్మాతలు 2 కోట్లు ఇచ్చి మరీ నటింపచేశారట. ఇందుకు కారణం.. అసలీ బూతు సినిమా చేసేందుకు ఎవరూ ఒప్పుకోకపోవడమే. అందుకే ఎక్కువ మొత్తం చెల్లించి మరీ.. అవసరాలతో తీశారని అంటున్నారు. రొమాన్స్ లో నెక్ట్స్ లెవెల్ ని తెరపై చూపించే ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ, శ్రీముఖిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బూతు టైపు సినిమాలో నటించే కుర్ర హీరోకే ఇంతిస్తే.. మరి హీరోయిన్లకు ఎంతిచ్చారో అనే టాక్ కి ఇప్పుడు సౌండింగ్ పెరిగింది.