ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇండియాలో కూడా ఈ సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా జరిగిన విషయం తెలిసిందే.
పదుల కోట్ల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తాం అంటూ డిస్నీ వారు నమ్మకంగా ఉన్నారు.
ఇక ఈ సినిమా తెలుగు లో డబ్బింగ్ అయినప్పటికీ సన్నివేశాలకు మరియు పాత్రల తీర్పు తగ్గట్లుగా ఆకట్టుకునే డైలాగ్స్ ఉండాలని ఉద్దేశంతో మంచి రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ తో డైలాగ్స్ రాయించారట.
సన్నివేశాలకు తగ్గట్లుగా ఆయన తన కలంకు పదును పెట్టి మరీ ఈ సినిమా కోసం డైలాగ్స్ రాశాడట. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇప్పటికే ఎన్నో సక్సెస్ లను దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్ కి ఇది గొప్ప అవకాశం గా చెప్పుకోవచ్చు.
అవతార్ 2 తో జేమ్స్ కామెరున్ పుష్కర కాలం తర్వాత ప్రశ్నల ముందుకు రాబోతున్నాడు. పండోరా ప్రపంచానికి మరోసారి ప్రేక్షకులను తీసుకు వెళ్తున్నాడు. కనుక ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడి కూడా ఎంతో ఆసక్తిగా అవతార్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో తెలుగు వర్షన్ కు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశాడు అనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అవతార్ 2 కలెక్షన్స్ విషయంలో రికార్డ్స్ నమోదు చేయడం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.