అవ‌తార్ 2 ఆ ఫార్మాట్ లో షాకిచ్చేసిందిగా!

Update: 2022-12-18 23:30 GMT
జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టిగా దాదాపు ప‌ద‌మూడేళ్ల క్రితం విడుద‌లై యావ‌త్ ప్ర‌పంచాన్ని `అవ‌తార్` అబ్బుర ప‌రిచింది. వ‌ర‌ల్డ్ ఫ‌స్ట్ క్లాస్ టెక్నాలజీతో రూపొందిన ఈ మూవీ సినీ ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇలాంటి సంచ‌ల‌న సినిమాకు సీక్వెల్ గా ప‌ద‌మూడేళ్ల విరామం త‌రువాత జేమ్స్ కెమెరూన్ రూపొందించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్ `అవ‌తార్ ద వే ఆఫ్ వాటర్‌`. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూసింది.  

భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. ఇండియా వైడ్ గా వివిధ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ తొలి రోజు రూ. 38 కోట్ల నుంచి 40 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇండియా వైడ్ గా వివిధ భాష‌ల్లో ప‌లు ఫార్మాట్ ల‌లో రిలీజైన `అవ‌తార్ 2` పై విమ‌ర్శ‌కులు విజువ‌ల్ వండ‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే కొంత మంది మాత్రం మిశ్ర‌మంగా స్ప‌దిస్తూ ఫ‌స్ట్ పార్ట్ స్థాయిలో లేదంటూ పెద‌వి విరుస్తున్నారు.

వివిధ ఫార్మాట్ ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఓ ఫార్మాట్ లో మాత్రం డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. 3డీ ఫార్మాట్ కు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నా.. కానీ 2డీ వెర్ష‌న్ విష‌యంలో మాత్రం పెద‌వి విరుస్తున్నారు. దీంతో 2డీ వెర్ష‌న్ ఫార్మాట్ మాత్రం డిజాస్ట‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌ద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ మూవీపై వున్న క్రేజ్ ని దృస్టిలో పెట్టుకుని మేక‌ర్స్ ఇండియా వైడ్ గా 4కె, 2కె, 2డీ, 3డీ హెచ్ డీఆర్‌, డాల్బీ అట్మోస్ ఫార్మాట్ ల‌లో రిలీజ్ చేశారు.

3డీ ఫార్మాట్ కి మాత్ర‌మే భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. కానీ 2డీ ఫార్మాట్ మాత్రం ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. అవ‌తార్ అంటేనే విజువ‌ల్ వండ‌ర్‌. అలాంటి సినిమాని చూడాలంటే 3డీ ఫార్మాట్ లో మాత్ర‌మే చూడాలి. అలా చూస్తేనే ఆ విజువ‌ల్స్ గ్రాండియ‌ర్ ని ప్రేక్ష‌కులు స‌హానుభూతి చెందగ‌ల‌డు. అదే 2డీలో అయితే ఆ ఫీల్ ఎక్క‌డా క‌నిపించ‌దు. క‌ల‌గ‌దు. ఆ కార‌ణంగానే అవ‌తార్ 2 2డీ ఫార్మాట్ వెర్ష‌న్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ కార‌ణంగానే వ‌సూళ్లు కూడా అంతంత మాత్ర‌మే వ‌చ్చాయి. సింగిల్ స్క్రీన్ ల‌లో ఈ మూవీ కోటికి పైగా మాత్ర‌మే వ‌సూలు చేసిందంటే ఏ స్థాయిలో 2డీ వెర్ష‌న్ పై ఆడియ‌న్ ఆస‌క్తి చూపించ‌లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News