మరొక్క వారంలో ప్రపంచానికి ఓ కొత్త విలన్ పరిచయం కాబోతున్నాడు. అతడే ఎవెంజర్స్ః ఇన్ఫినిటీ వార్ లోని సూపర్ విలన్ థానోస్. ఒక్క విలన్ పదుల సంఖ్యలో సూపర్ హీరోలతో నిర్మించిన ఎవెంజర్స్ సినిమా కోసం ప్రపంచంలో కోట్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో తెలుగువారు ఉన్నారు. ఈ వారమే ఎవెంజర్స్ థియేటర్లలోకి రానుంది. మరి భరత్ పరిస్థితేంటీ? ఎవెంజర్స్ వస్తే భరత్ అను నేను కాస్త వెనక్కి వెళ్లాల్సిందేనా?
రంగస్థలం వచ్చి ఇరవై రోజులు అయిపోయింది. నా పేరు సూర్య విడుదలవ్వడానికి ఇంకా మధ్యలో రెండు వారాల సమయం ఉంది. ఈ మధ్యలో కలెక్షన్లను కుమ్మేద్దాం అనుకున్నాడు భరత్. అది కొంతవరకు నిజమే. కానీ ఈ లోపే ఊహించని విధంగా ప్రపంచం మెచ్చిన ఎవెంజర్స్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27న ఎవెంజర్స్ విడుదల కానుంది. మాస్ సెంటర్లలో భయం లేదు కానీ ఖరీదైన టిక్కెట్లు కల మల్టీప్లెక్ట్ థియేటర్ల ఉంచి మాత్రం భరత్ ఖాళీ చేయాల్సి రావచ్చు. ఎవెంజర్స్ చూడటానికి వచ్చేవాళ్లలో మల్టీప్లెక్స్ కు వచ్చే సినీ జనాలు ఎక్కువ. రూ.250 రూ.150 టిక్కెట్లు కేవలం మల్టీప్లెక్స్ లలో మాత్రమే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచి భరత్ వెళ్లిపోతే కాస్త నష్టమే మరి.
ఆ తరువాత నా పేరు సూర్య విడుదలవుతుంది కనుక చాలా మాస్ సెంటర్ల నుంచి భరత్ మారిపోవాల్సి వస్తుంది. నష్టం భారీగా ఉండకపోయినా ఎవెంజర్స్ ఎంతో కొంత భరత్‌కు దెబ్బేసినట్టే. మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయికగా వస్తోంది. ఇందులో సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ బ్లాక్ పాంథర్ ధోర్ ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు. తెలుగులో సూపర్ విలన్ థానోస్ కు రానా డబ్బింగ్ చెప్పాడు.