ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బిజీగానే ఉన్నాయి. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. నాలుగు వారాల క్రితం వచ్చిన రామ్ చరణ్ మూవీ రంగస్థలం ఇంకా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఉండడమే కాదు.. హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.
ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 27న విడుదల కావాల్సి ఉన్న రజినీకాంత్ మూవీ కాలా కరికులన్ వాయిదా పడింది. దీంతో ఇదే డేట్ కు హడావిడిగా వచ్చేందుకు నాగశౌర్య-సాయిపల్లవి నటించిన కణం.. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర రెడీ అయిపోయాయి. నిజానికి ఆ రోజున వస్తున్న ఓ డబ్బింగ్ సినిమా.. ఇప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలనే వణికిస్తోంది. అవెంజర్స్- ది ఇన్ఫినిటీ వార్ మన దగ్గర భారీగానే విడుదల కానుంది. పైగా అవెంజర్స్ దెబ్బ మామూలుగా ఉండదని అనిపిస్తోంది. తెలుగు జనాలు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలకు బాగానే అలవాటు పడ్డారు. అందులోనూ అవెంజర్స్ కు ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. ఒకవైపు అవెంజర్స్ ప్రభావంతో భరత్ అనే నేను మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ ఉటుందనే అచనాల ఉన్నాయి.
అలాంటి సమయంలో ఎలాంటి పబ్లిసిటీ.. ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా ఆచారి అమెరికా యాత్ర.. కణం అంటూ 2 సినిమాలు వస్తున్నాయి. ఒకవైపు భరత్ ప్రభంజనం.. మరోవైపు రంగస్థలం నిలకడ.. వీటితోపాటు ఇప్పుడు అవెంజర్స్ చేయబోతున్న దాడి.. వీటన్నిటి మధ్య ఈ చిన్న సినిమాలు నిలబడడం అంత ఈజీ కాదు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా పైనే అవెంజర్స్ ఎఫెక్ట్ తప్పదని ట్రేడ్ జనాలు అంటుంటే.. మరి ఈ ఆచారి.. కణం ఎలా తట్టుకుంటాయో.. తెలుగు జనాలను ఏ మాత్రం థియేటర్ల వైపు రప్పించగలుగుతారో చూడాలి.