భారీ అంచనాల నడుమ, అవతార్ రికార్డు బ్రేకింగ్ లక్ష్యంగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాలీవుడ్ మూవీ 'ఎవెంజర్స్ : ది ఎండ్ గేమ్' చిత్రం అనుకున్నట్లుగానే సంచలనాలు నమోదు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తుంది. వర్షం అనే కంటే కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది అనడం కరెక్ట్. ఇండియాలో కూడా ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల కూడా భారీగా రాబడుతోంది. ఒక డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టడం జరుగుతుంది. ఇండియాలో ఈ చిత్రం వెయ్యి కోట్లను సునాయాసంగా వసూళ్లు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఎవెంజర్స్ సందడి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మనం వద్దాం అనుకున్న సినిమాలు ఇప్పుడు బ్యాక్ అవుతున్నాయి.
మంచి వసూళ్లతో నడుస్తున్న జర్నీ, మజిలీ సినిమాలు ఎవెంజర్స్ సినిమా దెబ్బకు కుదేలు అయ్యాయి. ఆ కారణంగానే మే 1న విడుదల అవ్వాల్సిన నిఖిల్ 'అర్జున్ సురవరం' ఇప్పటికే వాయిదా పడింది. మహర్షి విడుదల తర్వాత తమ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక నిన్న మొన్నటి వరకు మే 1న ఖచ్చితంగా విడుదల చేస్తాం అంటూ చెబుతూ వచ్చిన 'అభినేత్రి 2' చిత్ర యూనిట్ సభ్యులు కూడా తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళనాడులో అభినేత్రి 2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాంటి తమిళనాడులో భారీగా ఈ చిత్రంను విడుదల చేసి మంచి ఓపెనింగ్స్ వసూళ్లను రాబట్టుకోవాలని భావించారు.
ఎవెంజర్స్ దెబ్బకు తమిళనాట రెండు వారాల వరకు థియేటర్లు దొరకడం కష్టం అయ్యింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు అన్ని కూడా ఎవెంజర్స్ తో నిండి పోయి, రెండు వారాల వరకు బుక్ అయ్యి ఉన్నాయి. దాంతో అభినేత్రి 2 చిత్రంను ఇలాంటి సమయంలో విడుదల చేస్తే ఓపెనింగ్స్ కోల్పోవడంతో పాటు, భారీ నష్టం మూట కట్టుకోవాల్సి వస్తుందనే భయంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అభినేత్రి విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుదేవా, తమన్నాల కాంబినేషన్ లో విజయ్ అభినేత్రి 2 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సీక్వెల్ పై అంచనాలు తమిళనాట బాగానే ఉన్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే సేఫ్ టైం లో అభినేత్రి 2 ని దించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.