2009లో రికార్డ్ ని బ్రేక్ చేయడానికి 2019 వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది! ఏకంగా పదేళ్లు వెయిటింగ్. హేమాహేమీలకే సాధ్యం కాని రికార్డ్ అది. ఎట్టకేలకు ఇన్నాళ్టికి ఆ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నారు. అంత గ్రేట్ రికార్డ్ సృష్టించిన సినిమా ఏదో ప్రత్యేకంచి చెప్పాలా? లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన `అవతార్` గురించే ఇదంతా. ప్రపంచ సినీచరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డుల్ని నెలకొల్పిన చిత్రమిది. అవతార్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 19,210 కోట్లు ( 2.78 బిలియన్ డాలర్లు) వసూలు చేసింది.
అయితే ఆ రికార్డును కొద్దిరోజులకే బ్రేక్ చేస్తుందని భావించిన `అవెంజర్స్ -ఎండ్ గేమ్` ఇప్పటికి కానీ ఆ స్థాయిని అందుకోలేకపోతోంది. ఇంకా ఈ సినిమా అవతార్ రికార్డును కొట్టాలంటే మరో రూ. 3.44 కోట్లు (5 లక్షల డాలర్లు) వసూలు చేయాల్సి ఉందట. పైగా ఈ రికార్డును బ్రేక్ చేయడం కోసమే సినిమా నుంచి తొలగించిన హల్క్ సీన్స్ ని యాడ్ చేశారు. ఒకసారి థియేటర్ల నుంచి వెనక్కి తీసుకుని మరీ రీరిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎండ్ గేమ్ చిత్రానికి ఆరంభం ఎంత క్రేజు వచ్చినా.. ఎన్ని సినిమాల రికార్డుల్ని వేటాడుతూ ముందుకు సాగినా `అవతార్` రికార్డును బ్రేక్ చేయడానికి మాత్రం చాలా కాలమే వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ వారంలో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందంటూ మార్వల్ సంస్థ బాస్ కెవిన్ ఫీజ్ ప్రకటించారు.
అయితే ఈ సంతోషం కెవిన్ కి ఎంతో కాలం నిలవదని విశ్లేషిస్తున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డుల్ని బ్రేక్ చేసే సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. అదే `అవతార్ 2`. కామెరూన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తొలి భాగాన్ని మించిన బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనికోసం 450 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అందుకే అవతార్ చిత్రాన్ని మించిన రికార్డులు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అవతార్ అభిమానులు పిచ్చెక్కి వెయిట్ చేస్తున్నారు. సీక్వెల్ ఇప్పటికే రావాల్సినది.. క్వాలిటీ వర్క్ కోసం ఆలస్యమవుతోందని ప్రకటించారు. అవెంజర్స్ కే దిమ్మతిరిగే ట్రీట్ ని మరో రెండేళ్లలోనే అవతార్ సీక్వెల్ రూపంలో హాలీవుడ్ ప్రియులు చూడబోతున్నారు.