వెండితెరపై హీరోలు ఎంత వీరపరాక్రమాలు చూపించినా ఒక్క పైరసీ భూతం వద్ద మాత్రం తల వంచాల్సిందే. దానికి చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. నిర్మొహమాటంగా సినిమా విడుదల కావడం ఆలస్యం మహమ్మారిలా కమ్మేస్తుంది. దీనికి అవెంజర్స్ ఎండ్ గేమ్ లోని సూపర్ హీరోస్ సైతం మినహాయింపుగా నిలవలేదు. రేపు ఇండియాలో కనివిని ఎరుగని స్థాయిలో రికార్డుల ఊచకోత టార్గెట్ గా విడుదల కానున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ అప్పుడే పైరసీ బారిన పడినట్టు టాక్.
కొన్ని దేశాల్లో ఇవాళ విడుదల కానుండగా రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా కొన్ని ఎంపిక చేసిన చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సుప్రసిద్ధ జర్నలిస్టులు చూసి పొగడ్తలతో ముంచెత్తారు కూడా. మరి ఎక్కడ లీక్ అయ్యిందో ఎలా తీశారో తెలియదు కాని భారతదేశంలో రిలీజ్ కు ముందే ఇది అనధికార సైట్లలో ప్రత్యక్షం కావడంతో అభిమానులు షాక్ తింటున్నారు
అవెంజర్స్ లో మెయిన్ విలన్ తానోస్ కంటే ఈ పైరసీ ప్రమాదకరంగా మారిందని ఈ జాడ్యాన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదని దిగ్గజ నిర్మాణ సంస్థలు లబోదిబో మంటున్నాయి. ఇలాంటి సినిమాలు ధియేటర్లో అందులోనూ త్రీడి లో చూస్తే వచ్చే అనుభూతే వేరు. కాకపోతే ఇలా ముందే బయటికి వస్తే స్టొరీతో పాటు మ్యాటర్ ఏంటి అనే వివరాలు తెలిసిపోతాయి. దీని వల్ల కొంత ఉత్సుకత తగ్గుతుంది.
అంతే తప్ప హాల్ కు వెళ్ళాలని డిసైడ్ అయిన ప్రేక్షకుడు తన అభిమాన సూపర్ హీరోస్ ని బిగ్ స్క్రీన్ మీదే చూస్తాడు. మన దేశంలోనూ ఎండ్ గేమ్ ప్రీమియర్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టబోతున్నారు. చాలా చోట్ల రేపు ఉదయం 7 నుంచే షోలు పడబోతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఏ రికార్డులు నమోదవుతాయో ఊహకందటం కూడా కష్టంగానే ఉంది