అవెంజ‌ర్స్: ఇండియాలో రికార్డు బ్రేకింగే

Update: 2019-04-22 05:15 GMT
ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా `అవెంజ‌ర్స్` మానియా కుదిపేస్తోంది. కిడ్స్- యూత్ తో పాటు పెద్దాళ్లు వ‌య‌సుతో ప‌నే లేకుండా ఈ సినిమాని చూడాల‌న్న ఉత్సాహం క‌న‌బ‌రుస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే `అవెంజ‌ర్స్: ఎండ్ గేమ్` 3డి, ఐమ్యాక్స్ 3డి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. ఇప్ప‌టికే బుక్ మై షో బ్లాక్ అయిపోయింది. సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టేశారు. ముఖ్యంగా హైద‌రాబాద్ స‌హా అన్ని మెట్రో న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సుల్లో ఇదే ప‌రిస్థితి ద‌ర్శ‌న‌మిస్తోందిట‌.

2018లో `అవెంజ‌ర్స్- ఇన్ ఫినిటీ వార్` రిలీజైంది. ఈ సినిమాని 3డి వెర్ష‌న్ లో చూసేందుకు జ‌నం థియేట‌ర్ల‌పై ఎగ‌బ‌డ్డారు. ఈసారి అంత‌కుమించిన హైప్ ఎండ్ గేమ్ కి క‌నిపిస్తోంది. అవెంజ‌ర్స్ సిరీస్ లోనే అత్యంత క్రేజీగా రిలీజ‌వుతున్న సినిమా ఇది. దీంతో ముఖ్యంగా హైద‌రాబాద్ లో టిక్కెట్లు దొర‌క‌డ‌మే గ‌గ‌నం అయిపోయింద‌న్న మాట వినిపిస్తోంది. తొలివారం టిక్కెట్లు దొర‌క‌బుచ్చుకోవాలంటే అంత సులువేం కాద‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే ఇదివ‌ర‌కెన్న‌డూ లేనంత‌గా ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయినా టిక్కెట్లు దొర‌క‌ని స‌న్నివేశం నెల‌కొంది. మల్టీప్లెక్సుల్లో అయితే ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే. క‌నీసం సింగిల్ థియేటర్ల‌లో అయినా ఛాన్సుంటుందేమోన‌ని వెతికేస్తున్న వాళ్లు ఉన్నారు.

అయితే ఈ సినిమాకి అంత‌టి క్రేజు ఎందుకు? అంటే 3డి- 3డి ఐమ్యాక్స్ లాంటి చోట్ల‌ విజువ‌ల్ స్పెక్టాక్యుల‌ర్ ట్రీట్ కోస‌మే జ‌నాలు ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. ఒక‌సారి 3డి విజువ‌ల్స్ కి అల‌వాటు ప‌డ్డాక ఆటోమెటిగ్గా ఆ ఆస‌క్తి పుడుతుంది. అలా పుట్టించ‌డంలో అవెంజ‌ర్స్ మేక‌ర్స్ ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక ప్ర‌పంచ దేశాల‌తో పాటు ఇండియాలోనూ ఈ సినిమాని ఒకేసారి ఏప్రిల్ 26న‌ రిలీజ్ చేస్తుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 500 థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే క్రేజు ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  ఈ ఊపు చూస్తుంటే అత్యంత వేగంగా బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరే తొలి మూవీగా `అవెంజ‌ర్స్ - ఇన్ ఫినిటీ వార్` కొత్త రికార్డును న‌మోదు చేస్తుంద‌న్న అంచ‌నా ఏర్ప‌డింది. అలాగే ఫుల్ ర‌న్ రికార్డుల్లోనూ ఎన్ని మెరుపులు మెరిపించ‌బోతోందోన‌న్న చ‌ర్చా సాగుతోంది. జంగిల్ బుక్, బ్లాక్ పాంథ‌ర్, ఇన్ ఫినిటీ వార్ చిత్రాలు ఇండియా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వ‌సూళ్లు ద‌క్కించుకున్నాయి. ఇప్పుడు అంత‌కుమించి `అవెంజ‌ర్స్- ఎండ్ గేమ్` వ‌సూలు చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

    

Tags:    

Similar News