టైటానిక్‌.. అవ‌తార్.. రికార్డుల వేట‌

Update: 2019-05-06 11:00 GMT
మార్వ‌ల్ సంచ‌ల‌నం `అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్` బాక్సాఫీస్ వ‌ద్ద అప్ర‌తిహ‌తంగా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ బాక్సాఫీస్ వ‌ద్ద క్రియేటైన‌ అన్ని రికార్డుల్ని ఈ సినిమా బ్రేక్ చేస్తోంది. అవ‌తార్.. స్టార్ వార్స్.. టైటానిక్ .. ఇన్ ఫినిటీ వార్.. ఇలా ఎన్నో సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేస్తూ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పేందుకు దూసుకెళుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజైన సినిమాల్లో 3 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో ఏ సినిమా లేదు. ఆ అరుదైన‌ రికార్డును `ఎండ్ గేమ్` అందుకుంటుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టికే `అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్` 2 బిలియ‌న్ డాల‌ర్ల మార్క్ ని అందుకుంది. సంచ‌ల‌నాల టైటానిక్ సాధించిన ఫుల్ ర‌న్ రికార్డు 2.187 బిలియ‌న్ డాల‌ర్లను ఈ చిత్రం బ్రేక్ చేస్తూ 2.188 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. అలాగే ఈ రికార్డును ఛేధించేందుకు `ఎండ్ గేమ్` చిత్రానికి కేవ‌లం 11రోజులు మాత్ర‌మే ప‌ట్టింది. `టైటానిక్` నెల‌కొల్పిన ఫుల్ ర‌న్ రికార్డును బ్రేక్ చేసేందుకు `అవ‌తార్` చిత్రానికి 47 రోజులు ప‌ట్టింది.

ఇక హాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఐదు సినిమాలు మాత్ర‌మే 2 బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరాయి. అవ‌తార్ -2.78 బిలియ‌న్ డాల‌ర్లు.. టైటానిక్ 2.187 బిలియ‌న్‌ డాల‌ర్లు.. స్టార్ వార్స్ :  ది ఫోర్స్ అవేకెన్స్ -2.06 బిలియ‌న్ డాల‌ర్లు.. అవెంజ‌ర్స్: ఇన్‌ఫినిటీ వార్ 2.04 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి టాప్ 5లో నిలిచాయి. వీట‌న్నిటి రికార్డుల్ని ఎండ్ గేమ్ చాలా త‌క్కువ స‌మ‌యంలో బ్రేక్ చేస్తోంది. ఇక అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మానియాని ఎన్ క్యాష్ చేసుకునేందుకు మార్వ‌ల్ సంస్థ భారీగా ఇత‌ర‌త్రా బిజినెస్ లు ప్లాన్ చేస్తోంది. ఎండ్ గేమ్ హ‌వాని క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాకి సంబంధించిన బొమ్మ‌ల్ని 4కె ఫార్మాట్ బ్లూ రే కాంబో ప్యాక్ బిజినెస్ కి తెర‌లేపింది. ప్రీ ఆర్డ‌ర్ల‌పై ఈ ప్యాక్ ని ఒక్కొక్క‌టి 35 డాల‌ర్ల‌కు విక్ర‌యిస్తున్నారు. ఇక‌ ఈ బిజినెస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద‌ల‌ కోట్ల మేర సాగుతుంద‌నేది ఓ అంచ‌నా. సూప‌ర్ హీరో సినిమాల‌కు ఇదో త‌ర‌హా స‌బ్ బిజినెస్ లు చూస్తున్న‌దే. స్పైడ‌ర్ మేన్.. అవ‌తార్ సినిమాల‌కు ఈ త‌ర‌హా బిజినెస్ సాగింది. బాహుబ‌లికి ఈ త‌ర‌హా ర‌క‌ర‌కాల బిజినెస్ లు చేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News