చిన్నారి పెళ్లికూతురు సన్నబడిపోయిందిగా

Update: 2016-02-03 04:06 GMT
ఉయ్యాలా జంపాలా మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసి, అవికా గోర్ మంచి నటిగా పేరు దక్కించుకుంది. అంతకు ముందే ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. బాలికా వధు హిందీ సీరియల్ ని చిన్నారి పెళ్లికూతురుగా మన తెలుగు ఛానల్ వాళ్లు డబ్బింగ్ చేసి ప్రసారం చేసేశారు. ఇందులో లీడ్  కేరక్టర్ మన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మామా సినిమాలు హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి కానీ.. అవేవీ పెద్ద సినిమాలు కాదు. ఇప్పుడు కూడా చేతిలో ఒకటి అరా తప్ప అవకాశాలు లేవు. దీనికి కారణం ఈమె  పర్సనాలిటీయే అని చెప్పాల్సిందే. నటన విషయంలో ఎన్ని మెరుపులు మెరిపించినా.. ఈమె బాడీ భారీగానే ఉంటుంది. బొద్దుగా అనే రేంజ్ కంటే ఎక్కువగా ఉండడం బాగా మైనస్ అయిపోయింది. ఈ విషయాన్ని ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లకు క్యాచ్ చేసింది అవిక.

అందుకే ఇప్పుడు సన్నబడిపోతోంది ఈ సుందరాంగి. కొన్ని నెలలుగా పర్ ఫెక్ట్ షెడ్యూలింగ్ తో జిమ్ లు, ఎక్సర్సైజులు చేసేసి ఆరు కిలోలు తగ్గిపోయి.. ఇదుగో ఇలా మారిపోయింది. తనలో ఇంకా చాలా అందాలున్నాయని.. వాటిని కూడా మెల్లగా చూద్దురగాని అన్నట్లుగా టీజ్ చేస్తున్నట్లు ఉంది కదూ ఈ ఫోటో చూస్తుంటే. ఇప్పటికైనా అవికాగోర్ కు ఆఫర్స్ క్యూ కడతాయేమో చూద్దాం. ప్రస్తుతం ఈమె నిఖిల్ కు జంటగా ఓ సినిమాలో చేస్తోంది.
Tags:    

Similar News