2022 మోస్ట్ అవైటెడ్ సినిమా `బ్రహ్మాస్త్ర` బహుభాషల్లో అత్యంత భారీ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తెలుగు-తమిళం మార్కెట్లను టార్గెట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. రణ్ బీర్ కపూర్ - నాగార్జున- అమితాబ్ - అలియా భట్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంది.
ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుండడంతో గత కొద్దిరోజులుగా రణబీర్ సహా దర్శకుడు ఆయాన్ ముఖర్జీ స్థానిక మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పరంగా దక్షిణాదినా హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రణబీర్ లాంటి స్టార్ తెలుగు మార్కెట్ ని కోరుకోవడం ఆశ్చర్యపరుస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు అయాన్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర సూపర్ హీరో చిత్రం కాదని వెల్లడించాడు. ఇది రణబీర్ పాత్రతో ముడిపడిన దైవిక శక్తులను తెరపై ఆవిష్కరిస్తుంది. ఇందులో అతను సూపర్ హీరో కాదని చెప్పారు. కథాంశం ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని కూడా అన్నారు.
ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి ప్రచారపరంగా సాయమందిస్తున్నారు. బ్రహ్మాస్త్రలో అమితాబ్ పాత్రకు ఆయన డబ్బింగ్ అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
బాహుబలి ప్రభావం లేనట్టేనా?
బాహుబలి ముందు బాహుబలి తర్వాత సినిమాల మేకింగ్ అమాంతం మారింది. బాహుబలి నేర్పిన పాఠాల్ని ఇంకా బాలీవుడ్ తలకెక్కించుకున్నది లేదు. నేటితరానికి ఏది నచ్చుతోంది? అన్నది గెస్ చేయడంలో దిగ్గజాల్లాంటి హిందీ ఫిలిమేకర్స్ సైతం పసిగట్టలేకపోతున్నారని `సామ్రాట్ పృథ్వీరాజ్` రిజల్ట్ నిరూపించింది. అక్షయ్ లాంటి బిగ్ స్టార్ తో యష్ రాజ్ ఫిలింస్ లాంటి అగ్ర బ్యానర్ ఈ సినిమాని తెరకెక్కించినా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అందుకే ఆయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర` దానిని బ్రేక్ చేస్తుందా? అన్న చర్చా ఇప్పుడు టాలీవుడ్ లో సాగుతోంది.
తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కి నాగార్జున లాంటి పెద్ద స్టార్ వల్ల కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకుముందే బ్రహ్మాస్త్ర నుంచి కింగ్ నాగార్జున లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఫిక్షన్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అతడి పాత్ర ఎలా ఉండనుందో వేచి చూడాలి. రణబీర్ లాంటి ట్యాలెంటెడ్ నటుడు ఫాంటసీ కంటెంట్ లో ఎలా కనిపించనున్నారో అంటూ క్రిటిక్స్ వేచి చూస్తున్నారు. సౌత్ లో ఈ సినిమా బాహుబలి తరహా మ్యాజిక్ చేస్తుందా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. బ్రహ్మాస్త్రం టార్గెట్ ని ఛేధిస్తుందా లేదా? జస్ట్ వెయిట్...