సినీ తారలను క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికే క్యాన్సర్ వల్ల ఎంతో మంది స్టార్స్ కన్ను మూయడంతో పాటు, కొందరు దానితో పోరాడి గెలిచారు. ప్రస్తుతం బాలీవుడ్ కు చెందిన హీరోయిన్ సోనాలి బింద్రే - రాకేష్ రోషన్ లు క్యాన్సర్ తో పోరాడుతున్నారు. గతంలో క్యాన్సర్ ను మనీషా కోయిరాల - మమతా మోహన్ దాస్ - యువరాజ్ సింగ్ లు ఇంకా కొందరు జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతున్న వారి జాబితాలోకి మరో బాలీవుడ్ స్టార్ చేరింది.
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ కు క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెళ్లడి చేసింది. ప్రస్తుతం తాను కీమో థెరఫీ చేయించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. కీమో థెరఫీ కోసం అందరిలాగే తహీరా కూడా గుండు చేయించుకుంది. గుండుతో ఉన్న ఫొటోను తహీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన గుండు ఫొటోకు సరదాగా ఇప్పుడు స్నానం చేసే సమయంలో పెద్దగా ఇబ్బంది లేదంటూ కామెడీగా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా ఉంటే చాలా స్వేచ్చగా అనిపిస్తోందంటూ కూడా పోస్ట్ లో కామెంట్ చేసింది. తహీరా కశ్యప్ పోస్ట్ కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఎంతో మంది ట్వీట్స్ చేశారు. నువ్వు ఎలా ఉన్నా కూడా అందంగా ఉంటావంటూ హృతిక్ రోషన్ తహీరా పోస్ట్ కు స్పందించాడు. ప్రస్తుతం మొదటి స్టేజ్ లో ఉంది కనుక తహీరాకు ఎలాంటి ఇబ్బంది లేదని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.