ఇప్పుడు వస్తున్న కొన్ని బాలీవుడ్ సినిమాలు.. గతంలో వస్తున్న షకీల సినిమాల్లా తయారయ్యాయ్. అశ్లీలతలో కాదులే.. కంటెంట్ ను ప్రమోట్ చేసే తీరులో. అప్పట్లో షకీలా మలయాళ సినిమాల్లో.. చూపించాల్సిన సీన్లన్నీ చూపించేసి.. ఇలా చేస్తే మాత్రం మీ జీవితం నాశనం అవుతుంది అంటూ లాస్టులో ఒక స్లయిడ్ వేసేవారు. ఇప్పుడు హిందీ సినిమాలు కూడా ఇలాగే తయారయ్యాయ్.
మొన్న విడుదలైన ''అజార్'' సినిమానే తీసుకోండి. ఈ సినిమా స్టార్టింగ్ లో ఇది అజారుద్దీన్ జీవిత చరిత్ర కాదు.. అంటూ ఈ సినిమాను మొదలెట్టారు. మరి జనాలనే చెవుల్లో పువ్వులు పెట్టుకున్న అమాయకులు? అసలు ఈ సినిమాకూ అజారుద్దీన్ కు సంబంధంల లేనప్పుడు.. మనోడు ప్రమోషన్లకు ఎందుకొస్తున్నాడు? హైదరబాద్ లో ఏదో ఐస్ క్రీమ్ సెంటర్ ఓపెనింగ్ అంటే కూడా ఇమ్రాన్ హష్మీ అండ్ ప్రాచీ దేశాయ్ తో కలసి అజార్ వచ్చేశాడు. అయినాసరే సినిమా ఇతగాడిది కాదంట మరి.
ఇకపోతే ఈ సినిమాలో అజార్ తప్పుచేయలదంటూ.. మనోళ్ళు మన కోర్టులను ఎలా బోల్తా కొట్టించారో చూపిస్తూ.. క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడు. ఏది.. అప్పట్లో సల్మాన్ ఖాన్ తాగింది వోడ్కా కాదు వాటర్ అంటూ హిట్ అండ్ రన్ కేసులో కోర్టు చెప్పింది చూడండి.. ఆ తరహాలో. కేవలం తన ఇమేజ్ ను కరక్టు చేసుకోండి అజారుద్దీన్ సొంత పెట్టుబడితో ఈ సినిమా తీశాడేమోనని ఎవరికైనా సందేహం వచ్చేస్తుంది మూవీ చూస్తే!!