23 ఏళ్ల తర్వాత అజర్ ఆ పని చేశాడు

Update: 2016-09-01 12:53 GMT
రీసెంట్ గా రిలీజ్ అయిన స్మాల్ మూవీ పెళ్లి చూపులు చాలామందిని కదిలించేస్తోంది. చిన్నా పెద్దా.. స్టార్లు- సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ మూవీ గురించి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

'నా కొడుకు అబ్బాస్(అసద్) పెళ్లి చూపులు చూడమని ప్రత్యేకంగా చెప్పాడు. చాలాసార్లే ప్రెజర్ చేశాడు. అంత గట్టిగా చెప్పడంతోనే సినిమా చూశాను. చాలా బాగా నచ్చేసింది' అని చెప్పాడు అజారుద్దీన్. అంతే కాదు.. ఇలాంటి మంచి సినిమాని తీసి దర్శకుడు తరుణ్ భాస్కర్.. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరిలను ప్రత్యేకంగా అభినందించాడు. అయితే.. ఓ మాజీ క్రికెటర్ ఓ సినిమా బాగుందంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఏముంది అనిపించడం సహజమే. అసలు విషయం అక్కడే ఉంది.

'నేను తెలుగు సినిమా చూసి 23 ఏళ్ళు అయింది. చివరగా ఈవీవీ సత్యనారాయణ తీసిన జంబలకిడి పంబ చిత్రాన్ని వైజాగ్ లో చూశాను.' అని అజార్ స్వయంగా ఆ విషయం చెప్పేశాడు. తనకు తెలుగు రాయడం చదవడం వచ్చని.. అయినా సినిమాలు చాలా తక్కువగా చూస్తానన్నాడు అజారుద్దీన్.
Tags:    

Similar News