బాలీవుడ్ సినిమా 'బిఎ పాస్' తెలుగులోకి అనువాదమై రిలీజైంది. ఇదో బోల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కించిన సినిమా. స్టార్ పవర్ లేకుండానే పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి ఉత్తరాదిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం 2కోట్ల బడ్జెట్ తో అజయ్ భాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 21 కోట్లు వసూలు చేసింది. అంటే పెట్టుబడి కంటే దాదాపు 10 రెట్లు అధిక లాభాల్ని అందించింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాలో కంటెంట్ ఏం ఉంది? అని మన దర్శకనిర్మాతలు రీసెర్చ్ లు చేశారు.
బిఎ పాస్ అయిన ఓ నూనూగు మీసాల కుర్రాడు ముంబైలోని ఆంటీ ఇంటికి వెళ్లాక అతడి జీవితంలో వచ్చిన అనూహ్య మార్పులేంటి? అన్నదే సినిమా. ఆంటీ వల్ల ఇబ్బందులకు గురై, ఆ తర్వాత పెళ్లయిన ఓ యువతి (శిల్పా శుక్లా) పరిచయంతో మేల్ ప్రాస్టిట్యూట్ గా మారి ఎలాంటి పాట్లు పడ్డాడన్నది తెరపైనే చూడాలి. ఇది పూర్తిగా మాస్ కంటెంట్ ఉన్న సినిమా. అడల్ట్ కంటెంట్ మితిమీరి ఉంటుంది. బోల్డ్ సన్నివేశాలు జీర్ణించుకోలేనివి. అందుకే ఇది తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్‌కి కాస్త డైజెస్ట్ చేసుకోలేని సినిమా అన్న టాక్ వచ్చింది. కానీ యూత్, మాస్ లో ఇది ఓ రేంజులో ఎక్కే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తి రిజల్ట్ తేలిపోతుంది. వెయిట్ అండ్ సీ.