ఎవ‌రినీ నొప్పించ‌ని ఆజాత శ‌త్రువు బి.ఏ.రాజు

Update: 2021-05-26 12:30 GMT
మ‌ద్రాసు నుంచి చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ హైద‌రాబాద్ కి త‌ర‌లి వ‌చ్చి ద‌శాబ్ధాల చ‌రిత్ర‌తో ఇక్క‌డ పెద్ద ఇండ‌స్ట్రీగా ఎదిగింది. టాలీవుడ్ ఇంతింతై ఎదిగే క్రమంలోనే మ‌ద్రాసు పరిశ్ర‌మ‌లో ప‌ని చేసి హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీలోనూ సీనియ‌ర్ పీఆర్వోగా జ‌ర్న‌లిస్టుగా బ‌హుముఖ ప్ర‌జ్ఞావంతుడిగా బి.ఏ.రాజు ఎదిగిన తీరు అసాధార‌ణం. ఆయ‌న సూప‌ర్ హిట్ మ్యాగ‌జైన్ ప్రారంభించి ఎంద‌రికో జ‌ర్న‌లిస్టుల‌కు ఉపాధి క‌ల్పించారు. ఆయ‌న త‌ర్వాతా వార‌సులు అరుణ్ కుమార్ - శివ‌కుమార్ ఈ మ్యాగ‌జైన్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు ముందుకు రావ‌డం హ‌ర్ష‌ణీయం.

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఈ సినీమ్యాగ‌జైన్ స్ఫూర్తితోనే డ‌జ‌న్ల కొద్దీ మ్యాగజైన్లు పుట్టుకొచ్చాయి. అయితే మ్యాగ‌జైన్ ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతున్న క్ర‌మంలోనూ సూప‌ర్ హిట్ నిల‌దొక్కుకుని ట్రేడ్ వ‌ర్గాల్లో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. బ‌హుశా టాలీవుడ్ లోనే సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌రో నాలుగైదు మ్యాగ‌జైన్లు మాత్ర‌మే ఇప్పుడు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. దాదాపు రెండు డ‌జ‌న్ల మ్యాగ‌జైన్లు పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యాయి.

ఇక బీఏ రాజుతో పాటు చెన్నైలో ప‌ని చేసిన ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు .. పీఆర్వోలు.. నేటిత‌రం జ‌ర్న‌లిస్టులు ఆయ‌నను స్మ‌రిస్తూ సంతాప‌స‌భలో త‌మ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జూమ్ మీటింగ్ లో సూప‌ర్ హిట్ ఆరంభంలో జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేసిన ప్ర‌భు.. ఆయ‌న కుమారులు శివ‌కుమార్- అరుణ్ కుమార్.. కొలీగ్స్ నాగేంద్ర‌కుమార్- సీవీ సుబ్బారావు- గిరిధ‌ర్- వినాయ‌క‌రావు- ఓం ప్ర‌కాష్‌- రెంటాల జ‌య‌దేవ‌- ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్- ద‌ర్శ‌కుడు తేజ‌- నిర్మాత శ‌ర‌త్ మ‌రార్- నిర్మాత కె.ఎస్.రామారావు- క‌థానాయిక అంకిత‌ త‌దిత‌రులు సంతాప స‌భ జూమ్ స‌మావేశంలో పాల్గొన్నారు.

ప‌రిశ్ర‌మ‌లో ఆజాత శ‌త్రువుగా .. అంద‌రికీ అవ‌కాశాలు క‌ల్పించిన గొప్ప మ‌న‌సున్న వాడిగా ఎప్పుడూ చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించే రేర్ ప‌ర్స‌నాలిటీగా రారాజుగా అంద‌రి మ‌నుసుల్లో నిలిచారు. ఆయ‌న నిష్కృమ‌ణం ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని సంతాప స‌భ‌లో ప్ర‌ముఖులు సంస్మ‌రించారు. బి ఏ రాజు కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.
Tags:    

Similar News