మూడు రెట్లు.. బాహుబలి-2 రేట్లు

Update: 2016-02-03 05:55 GMT
సిరీస్ లో భాగంగా వచ్చిన ఒక సినిమా హిట్ అయిందంటే.. ఖచ్చితంగా రెండో మూవీకి రేట్లు ఆకాశంలో ఉంటాయి. బాహుబలి నిర్మాతలు కూడా ఇదే ఫాలో అయిపోతున్నారు. బాహుబలి ది కంక్లూజన్ కి.. ఎవరూ ఊహించలేనంతగా రేట్లు చెబుతున్నారు. అసలు ఇంత మొత్తం తిరిగి రాబట్టే అవకాశం ఉందా అంటే ఆలోచనలో పడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడి లెక్కలు ఇంకా తెగలేదు కానీ... ఇప్పటికైతే యూఎస్ రైట్స్ కోసం టాక్స్ పీక్స్ లో ఉన్నాయి.

బాహుబలి2 కోసం.. అమెరికా హక్కులకు గాను 35 కోట్ల రూపాయలు అడుగుతున్నారు నిర్మాతలు. మొదటి భాగం ఇక్కడ 7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే.. దీన్ని అమ్మిన రేటు మాత్రం 9 కోట్లే. యూఎస్ రైట్స్ కొన్నవారకి పెట్టుబడికి 3 రెట్లకు పైగా లాభాలు వచ్చాయి. అయితే, ఈ సారి మాత్రం రేటు విషయంలోనే బాగా ఎక్కువ చెబుతున్నారు. అంతర్జాతీయ రైట్స్ నుంచి కనీసంగా 50 కోట్లు రాబట్టాలన్నది బాహుబలి నిర్మాతల ఆలోచన. అందులో అమెరికా నుంచే 35 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

కానీ ఇంత మొత్తం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. మొదటి భాగానికి వచ్చినంతగా 7 మిలియన్ డాలర్లు వసూలు చేసినా.. షేర్ రూపంలో వచ్చే మొత్తం 30 కోట్లకు అటూ ఇటూగా ఉంటుందంతే. మరి 35 కోట్లకు కొంటే.. బాహుబలి రేంజ్ లో హిట్ అయినా.. పెట్టుబడి కూడా రాదు. అందుకే బాహుబలి సీక్వెల్ రైట్స్ కొనుగోలు విషయంలో వెనకాడుతున్నారు.
Tags:    

Similar News