బాహుబలి వర్సెస్ తలసాని

Update: 2017-04-27 05:32 GMT
శుక్రవారం విడుదల కావాల్సిన 'బాహుబలి-2' చిత్రం బెనిఫిట్ షోల విషయంలో డైలమా ఏర్పడింది.  ఏపీలో అంతా అనుకున్నట్లే సాగుతున్నా తెలంగాణలో మాత్రం  భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలకు ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని, నిబంధనలను అతిక్రమిస్తే - థియేటర్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు తప్పవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ వార్నింగ్ ఇవ్వడంతో - ఇప్పటికే వేలాది టికెట్లను ప్రీమియర్ షోల పేరిట విక్రయించిన నిర్మాతల్లో ఆందోళన పెరిగింది.
    
ఆంధ్రప్రదేశ్ లో సినిమాల ప్రదర్శనకు విచ్చలవిడిగా అనుమతులిచ్చారని..  ఆంధ్రాలో ఏం జరిగినా టీవీ ఛానెళ్లు తెలంగాణలో జరిగినట్టు చూపెడుతుంటాయని.. తెలంగాణలో విచ్చలవిడిగా సినిమాషోల ప్రదర్శనకు అనుమతిచ్చామని, టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రసారం చేస్తున్నాయని తలసాని మండిపడ్డారు. తెలంగాణలో అదనపు షోలకు అనుమతుల్లేవని తెలిపారు. టికెట్ ధరలు పెంచినా తీవ్ర చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
    
కాగా హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి ఆరు ప్రీమియర్ షోలకు టికెట్లను విక్రయించారు. ఐనాక్స్ జీవీకే వన్ లో రాత్రి 9:45 - 10 గంటలకు రెండు షోలు - తివోలీ సినిమాలో రాత్రి 9:30 - 9:45 గంటలకు - ఏసియన్ ఎం క్యూబ్ మాల్ లో రాత్రి 9:45 గంటలకు - సంధ్య 70 ఎంఎంలో రాత్రి 9:00 గంటలకు - సినీపోలిస్ మంత్రా మాల్ లో రాత్రి 9:05 - 10:25 గంటలకు - సినీపోలిస్ సీసీపీఎల్ మాల్ లో రాత్రి 9:50 నుంచి ఐదు షోలకు - ఏషియన్ స్వప్న థియేటర్లలో రెండు షోలకు, బీవీకే మల్టీప్లెక్స్ లో మూడు షోలకు టికెట్లను విక్రయించారు.  కానీ... ఈ అన్ని థియేటర్లలో చిత్రాన్ని ముందుగా ప్రదర్శిస్తే కఠిన చర్యలుంటాయని తలసాని స్పష్టం చేయడంతో, అటు నిర్మాతల్లో - ఇటు టికెట్లు కొన్న అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News