బాహుబలి ది కంక్లూజన్.. ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు రెండు భాగంపై అయితే.. అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. అందుకే బాహుబలి2 ప్రీ రిలీజ్ బిజినెస్.. బాహుబలి పార్ట్ ఫుల్ రన్ కలెక్షన్స్ కు మించి జరుగుతోంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 66 కోట్లకు బాహుబలి విక్రయిస్తే.. ఏకంగా 110 కోట్లు రాబట్టి సెన్సేషన్స్ సృష్టించింది. ఇప్పుడు బాహుబలి 2 విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 130 కోట్లకు చేరిపోయింది. అంటే బాహుబలి పార్ట్1 ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ కంటే 20 కోట్లు ఎక్కువగా వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం కాదన్న మాట. దాదాపు ప్రతీ ఏరియాలోనూ.. గతంలో విక్రయించిన రేట్లకు రెట్టింపు మొత్తానికి విక్రయించారు. ఉదాహరణకు బాహుబలి1 నైజాం ఏరియా రైట్స్ దాదాపు 23 కోట్లు కాగా.. బాహుబలి2కి 47 కోట్లకు మించి విక్రయించినట్లు తెలుస్తోంది.
అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు బాహుబలి ది బిగినింగ్ కి మించి మరో 20 కోట్లను రాబట్టడం బాహుబలి2కి సాధ్యం అవుతుందా అన్నదే ప్రశ్న. అయితే.. సమ్మర్ సీజన్ లో వస్తుండడంతో.. ఈ 130 కోట్ల టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/