ఇండియాలో అత్యధిక థియేటర్లలో రిలీజయ్యేవి బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలే. ఖాన్ త్రయంలో ఎవరి సినిమాలు వచ్చినా మినిమం 5 వేల థియేటర్లు పడుతుంటాయి. ఐతే వారి సినిమాలకు ఉత్తరాదిన ఉన్నంత క్రేజ్.. దక్షిణాదిన కనిపించదు. ఇక్కడ కొంచెం పరిమితంగానే థియేటర్లు ఇస్తారు ఆ సినిమాలకు. ఐతే మన ‘బాహుబలి’ సంగతలా కాదు. ఈ చిత్రానికి దక్షిణాదిన ఎంత క్రేజ్ ఉందో.. ఉత్తరాదిన కూడా అంతే హైప్ ఉంది. ఈ సినిమా కోసం మన ఆడియన్స్ లాగే ఉత్తరాది వాళ్లూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు పోటీగా ఇంకే హిందీ సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి లేదు. మిగతా భాషలన్నింట్లో కూడా ఇదే పరిస్థితి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎగ్జిబిటర్లు ‘బాహుబలి: ది కంక్లూజన్’ను తమ థియేటర్లలో ప్రదర్శించడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యధిక థియేటర్లలో రిలీజైన సినిమాగా ‘ది కంక్లూజన్’ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ 6500 థియేటర్లలో రిలీజవుతుందని సమాచారం. గత ఏడాది చివర్లో అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ దేశవ్యాప్తంగా 5500-6000 మధ్య థియేటర్లలో రిలీజైంది. దానికే అందరూ ఆశ్చర్యపోయారు. ‘బాహుబలి-2’ ఆ రికార్డును అలవోకగా దాటేస్తోంది. రిలీజ్ సమయానికి థియేటర్ల సంఖ్య ఇంకా పెరిగి 7000 మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. విశేషం ఏంటంటే.. విదేశాల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలోనే రిలీజవుతోంది. వివిధ దేశాల్లో కలిపి కనీసం వెయ్యి థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/