పాత రికార్డుల్ని బద్దలు కొట్టడం.. కొత్త రికార్డులు నెలకొల్పడం... గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సూపర్ స్టార్ కు ఆనవాయితీగా మారిపోయింది. ఆయన రికార్డుల్ని ఆయనే బద్దలు కొట్టుకుంటూ బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లిపోతున్నాడు. మిగతా బాలీవుడ్ సూపర్ స్టార్లు అమీర్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నారు. విశేషం ఏంటంటే.. మూడేళ్ల కిందట అమీర్ ఖాన్ ‘పీకే’తో నెలకొల్పిన రికార్డును మిగతా హీరోలే కాదు.. అమీర్ ఖాన్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. అమీర్ లేటెస్ట్ మూవీ ‘దంగల్’కు అద్భుతమైన రివ్యూలొచ్చాయి. టాక్ అదిరిపోయింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. అయినా అది ‘పీకే’ ఓవరాల్ కలెక్షన్లను దాటలేకపోయింది.
ఐతే ‘పీకే’ కొట్టగల మొనగాడు ‘బాహుబలి’ మాత్రమే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘బాహుబలి’ టార్గెట్ కూడా ‘పీకే’నే. సౌత్.. నార్త్ అని తేడా లేకుండా దేశమంతా ఈ చిత్రంపై భారీ అంచనాలతో ఉన్నారు కాబట్టి ఇది వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పడం ఖాయమని భావిస్తున్నారు. ఐతే వెయ్యి కోట్ల మాటేంటో కానీ.. ముందు ‘పీకే’ రికార్డులనైతే బద్దలు కొట్టి తీరాలని ‘బాహుబలి’ మూవీ మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ముందు ఇండియాలో.. మరికొన్ని దేశాల్లో విడుదలైన పీకే.. రూ.650 కోట్ల దాకా వసూలు చేసింది. ఆ తర్వాత చైనాలో ప్రత్యేకంగా విడుదలై.. మరికొన్ని దేశాల్లోనూ రిలీజై మంచి వసూళ్లు రాబట్టుకుంది. అలా మొత్తంగా ఈ చిత్ర కలెక్షన్స్ రూ.792 కోట్లకు చేరాయి. ఐతే ‘బాహుబలి’ ఫస్ట్ రిలీజ్ లోనే ఈ రికార్డును దాటేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ముందుగా ఇండియాలో.. ఇండియన్ సినిమాలు రెగులర్ గా రిలీజయ్యే దేశాల్లో సినిమాను రిలీజ్ చేసి.. ఆ తర్వాత వరల్డ్ వైడ్ మరిన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేస్తారట. ఐతే ఫస్ట్ రిలీజ్ లోనే ‘పీకే’ను దాటేసి రూ.1000 కోట్ల మార్కును ‘బాహుబలి’ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/