అనుకున్నదే అయింది. ‘బాహుబలి’ దెబ్బకు యూట్యూబ్ షేకైపోయింది. ఇండియన్ సినిమా ట్రైలర్ల యూట్యూబ్ రికార్డులన్నీ ‘ది కంక్లూజన్’ ట్రైలర్ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఉదయం 10 గంటలకు విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ యూట్యూబ్‌లో ప్రకంపనలు రేపింది. తెలుగు ట్రైలర్ మాత్రమే కేవలం ఆరు గంటల్లోనే 70 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుని ఔరా అనిపించింది. లైక్స్ 3 లక్షలు దాటిపోయాయి. ఇంకో రెండు గంటల్లోనే ‘ది కంక్లూజన్’ ట్రైలర్ కోటి మార్కును దాటేయడం ఖాయం. ఇప్పటిదాకా తెలుగులో ‘కాటమరాయుడు’ టీజర్ మాత్రమే కోటి మార్కును అందుకుంది. ఆ టీజర్ 2.5 లక్షల లైక్స్ తెచ్చుకుని రికార్డు సృష్టిస్తే ‘ది కంక్లూజన్’ ట్రైలర్ అప్పుడే 3.2 లక్షల లైక్స్ దాటేసింది.
హిందీ.. తమిళం.. మలయాళ ట్రైలర్లు కూడా ఇదే రీతిలో యూట్యూబ్ లో భారీగా వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. హిందీ ట్రైలర్ 30 లక్షల మార్కును దాటేసి.. లక్షకు పైగా లైక్స్ తెచ్చుకుంటే.. తమిళ ట్రైలర్ 25 లక్షల మార్కు దిశగా దూసుకెళ్తోంది. మలయాళ ట్రైలర్ 2 లక్షల మార్కును దాటింది. నాలుగు ట్రైలర్లూ కలుపుకుంటే కోటి మార్కును ఎప్పుడో దాటేశాయి. లైక్స్ 5 లక్షలకు పైగానే ఉన్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ 24 గంటలు తిరిగేసరికి 2 కోట్ల వ్యూస్ మార్కును అందుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. ట్రైలర్ కు వస్తున్న స్పందనపై రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘థ్యాంక్స్ ఎ మిలియన్ ఎవరీవన్.. ట్రైలర్ విడుదలైన గంటలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇది ట్రెండవుతోంది’’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
Full View
Full View
Full View
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/