తెరమీదకు 'బాహుబలి బిఫోర్ ది బిగినింగ్'.. బడ్జెట్ ఎంతంటే..??

Update: 2021-03-17 13:15 GMT
డార్లింగ్ ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్ గా మారింది బాహుబలి సినిమాతోనే.. ప్రభాస్ టైటిల్ రోల్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమా సిరీస్ ఇటు దేశంతో పాటు అటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది. భారతీయ సినిమారంగాన్ని మరోస్థాయికి చేర్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బాహుబలి- ది కన్‌క్లూజన్' మూవీ అయితే బాక్సాఫీస్ రికార్డులు అన్నింటిని బద్దలుకొట్టింది. కలెక్షన్స్ లో ఆల్‌టైమ్ టాప్ ఇండియన్ మూవీస్ ప్రథమ వరుసలో నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సంచలనానికి దారితీస్తోంది. భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న బాహుబలి సినిమా ప్రపంచదేశాలలో ప్రసారం అయింది. తాజాగా ఈ బాహుబలి సిరీస్ మరోసారి తెరమీదకి రానుందట.

కానీ సినిమాగా కాదు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రూపంలో 'బాహుబలి ది బిగినింగ్' ముందు అసలు మాహిష్మతి రాజ్యం ఎలా ఉండేది.. అక్కడి పరిస్థితి, బాహుబలి రాకముందు ఎలా ఉండబోయేది అనే అంశాలతో నెట్ ఫ్లిక్స్ తొమ్మిది ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదివరకే డైరెక్టర్ రాజమౌళి, నెట్ ఫ్లిక్స్ సంస్థలు భారీగా కోట్ల రూపాయల వ్యయంతో సిరీస్ తీయడం జరిగింది. కానీ అదంతా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని.. టెక్నికల్ గా అసలు బాలేదని పక్కన పెట్టేసారు. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. సుమారుగా రెండు వందలకోట్లు బడ్జెట్ అనుకుంటున్నట్లు టాక్. అలాగే ఈసారి డైరెక్టర్ రాజమౌళి కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయినట్లు సమాచారం. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ పట్ల చాలా ఆసక్తిగా ఉండటం విశేషం. అలాగే ఈ సినిమాకు 'బాహుబలి బిఫోర్ ది బిగినింగ్' అనే టైటిల్ అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.




Tags:    

Similar News