ఇంతవరకూ విదేశాల్లో ప్రభాస్‌కి అస్సలు రికార్డ్ అనేదే లేదు. ఓవర్సీస్ మార్కెట్‌లో పవన్, మహేష్ మాత్రమే టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. ఆగడు, అత్తారింటికి దారేది చిత్రాలతో మహేష్, పవన్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఈ రికార్డులన్నిటినీ ప్రభాస్ బాహుబలి తుడిచేస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' విదేశాల్లో రికార్డులతో చెలరేగిపోతోంది. ఈ సినిమా అమెరికాలో భారీ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
బాహుబలి ప్రీమియర్ షోల రూపంలో మొదటి రోజే 13లక్షల డాలర్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకూ అందిన రిపోర్ట్ ప్రకారం మరికొన్ని థియేటర్లలో వసూళ్లను లెక్కించాల్సి ఉంది. అవన్నీ చేరితో 15లక్షల డాలర్లకు వసూళ్ల లెక్కలు తేలే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటివరకూ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డ్ 50.5 లక్షల డాలర్లు. ఆ రికార్డుని బాహుబలి సవరిస్తుందని అంచనాలేస్తున్నారు. ఈ మూడు రోజుల్లోనే 30లక్షల డాలర్లు వసూలు చేసే చాన్సుందని చెబుతున్నారు. ఉత్తర అమెరికాలో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోందని టాక్.